Switch to English

నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథాంశం. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు సుమన్, నిర్మాత డి.ఎస్ రావు, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ చైర్మన్ శ్రీ కాట్రగడ్డ ప్రసాద్, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, ఫార్మర్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ కొల్లి రామకృష్ణ, మిసెస్ ఇండియా నేషనల్ & ఇంటర్నేషనల్ సుహాసిని పాండ్యన్ తదితరులు చీఫ్ గెస్ట్ లుగా రావడం జరిగింది. సీనియర్ నటులు సుమన్ స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు క్లాప్ కొట్టగా, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ప్రముఖ దర్శకులు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

గెస్ట్ గా వచ్చిన సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ చైర్మన్ శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ.. దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఇప్పటివరకు ఎన్నో సినిమా కథలకు గోస్ట్ రైటర్ గా వర్క్ చేసి ఎంతో అనుభవం సంపాదించిన తరువాత ఒక మంచి బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్న కథను రాసుకొని నిర్మాతలను అప్రోచ్ అవ్వడం జరిగింది. తను చెప్పిన స్క్రిప్ట్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నిర్మాతలకు ఇది మొదటి సినిమా అయినా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ మంచి సెంటిమెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకులు మెచ్చే మంచి సినిమా చేస్తున్న దర్శక, నిర్మాతలకు ఆల్ ద బెస్ట్ అన్నారు.

నటుడు, నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ.. ఈ మధ్య న్యూ టాలెంట్ తో వస్తున్న వారే ఎక్కువ హిట్ లు కొడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమాను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగితే ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇప్పటివరకు విశ్వ కార్తికేయ హీరోగా చాలా సినిమాలు చేసినా తన టాలెంట్ కి తగ్గ గుర్తింపు రాలేదనుకుంటున్నాను. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

చిత్ర నిర్మాతలు డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. మా మొదటి సినిమా ప్రారంబోత్సవానికి ఇంతమంది పెద్దలు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న మాకు దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో కొత్త టాలెంట్ ని బయటికి తీసుకురావాలనే కాన్సెప్టుతో సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. తను కథ చెప్పిన విధానం మాకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మాలాగే సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక్క నిమిషం సినిమా మిస్ అయినా సినిమా అర్థం కాదు. దాంతో మళ్లీ చూడాలనిపించేలా ఈ కథ చాలా బాగుంటుంది. జులై మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం జరుపుకొని సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మంచి కంటెంట్ తో వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

మరో నిర్మాత కాటం రమేష్ మాట్లాడుతూ.. రమాకాంత్ రెడ్డి ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎలాగైనా ఈ సినిమా చేయాలని డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ ఆతరువాత అందరం కలిసి ఒక యూనిట్ గా ఏర్పడి ఈ సినిమా స్టార్ట్ చేశాము. ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు

చిత్ర దర్శకులు రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను రాసుకున్న ఈ కథను తీసే నిర్మాతల కొరకు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న క్రమంలో నిర్మాతలు డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి,గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ గార్లు కలవడం జరిగింది. వారు ఈ స్టోరీ విన్న తరువాత వెంటనే ఈ సినిమా చేద్దామని నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. హీరో, హీరోయిన్స్ కూడా కథకు తగ్గట్టు బాగా సెట్టయ్యారు. ఫుల్ థ్రిల్లర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.

చిత్ర హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి చెన్నై నుంచి వచ్చిన ప్రసాద్ గారికి మరియు పెద్దలకు ధన్యవాదములు నేను చాలా రోజులుగా ఒక మంచి స్టోరీ కోసం వెతుకుతున్న. నాకు రమాకాంత్ రెడ్డి గారు చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. ఫైనల్ గా ఇది కదా నేను ఎదురు చూసిన సబ్జెక్ట్ అనిపించి వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. మంచి కథతో చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరోయిన్ ఆయుషి పటేల్ మాట్లాడుతూ.. దర్శకులు రమాకాంత్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఇలాంటి కథ అస్సలు మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. ఈ కథలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నన్ను నమ్మి ఇలాంటి మంచి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...