ఏపీలో మంత్రి సోదరుడు, వైఎస్సార్ సీపీ నేత ఓవరేక్షన్ చేశారు. అకారణంగా గొర్రెలకాపరులపై దాడి చేశారు. తాను వస్తుంటే గొర్రెలు రోడ్డుకు అడ్డంగా ఉండటమే ఆయన ఆగ్రహానికి కారణమైంది. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు వరసకు తమ్ముడు, వైసీపీ చిప్పగిరి మండల కన్వీనర్ నారాయణ శనివారం ఉదయం గుమ్మనూరు నుంచి ఆలూరుకు ఆరు వాహనాల్లో తన అనుచరులతో కలిసి బయలుదేరారు. మార్గమధ్యంలో గొర్రెలు అడ్డు వచ్చాయి. వాటిని పక్కకు అదిలించలేదని గొర్రెల కాపరులపై నారాయణ అనుచరులు దాడి చేశారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని తమవారికి చెప్పడంతో వారంతా చిప్పగిరి సర్కిల్ లో నారాయణ కోసం వేచి చూశారు.
మంత్రి జయరాంను కలిసిన తర్వాత నారాయణ తిరిగి వస్తున్నప్పుడు ఆయన్ను బాధితులు అడ్డుకుని నిలదీశారు. దీంతో నారాయణ మరింత రెచ్చిపోయారు. తాను మంత్రి తమ్ముడినని, వైసీపీ మండల కన్వీనర్ వస్తే అడ్డు తప్పుకోవాలంటూ హూంకరించారు. అంతేకాకుండా వారిపైనా చేయి చేసుకున్నారు. దీంతో బాధితులు గుంతకల్లు-ఆలూరు సర్కిల్ లో ధర్నాకు దిగారు. నారాయణ, ఆయన అనుచరులను అరెస్టు చేసేంత వరకు వెళ్లేది లేదంటూ బైఠాయించారు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కానీ నారాయణపై మాత్రం కేసు నమోదు చేయలేదు.
494963 75489If you are still on the fence: grab your favorite earphones, head down to a Finest Buy and ask to plug them into a Zune then an iPod and see which one sounds better to you, and which interface makes you smile much more. Then you will know which is right for you. 998926
930042 567978Music began playing anytime I opened up this web-site, so irritating! 488531
452447 998778Significant other, this superb site is fabolous, i merely adore it 826128
49795 644854All you require to know about News details to you. 490396
948155 809897Possible call for all types of led tourdates with some other fancy car applications. A lot of also offer historic packs and other requires to order take into your lending center, and for a holiday in upstate New York. ??? 575905