తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి సాధించడమెలా.? ఇది నిజానికి వ్యాపార సూత్రం. దాన్ని పరిపాలనలో అమలు చేస్తే ఫలితాలు అద్భుతంగా వుంటాయి. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ సర్కార్ ఆచరించి చూపించాలనుకుంటోందిట. రాజధాని అమరావతి విషయమై కృష్ణా – గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన సదరు వైసీపీ నేతలంతా ‘తక్కువ ఖర్చు, ఎక్కువ అభివృద్ధి’ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
ఈ కారణంగానే రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్నది సదరు వైసీపీ నేతల వాదన. లక్ష కోట్లకు పైగా ఖర్చు ఒకే ప్రాంతం (అమరావతిలో) మీద పెట్టడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందనీ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కష్టమవుతుందనీ, రాష్ట్రం కొత్తగా అప్పులు చేసే పరిస్థితి లేదనీ, అప్పులు ఎక్కువైపోతే వడ్డీలు కట్టడం ఇంకా కష్టమనీ సెలవిచ్చారు కృష్ణా – గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు.
నిజమే, అమరావతి మీద లక్షల కోట్లు వెచ్చించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టసాధ్యం. అయితే, అమరావతిలో ఖర్చు తగ్గించి.. అమరావతినే రాజదానిగా కొనసాగించొచ్చు కదా.? లక్షల కోట్లతో బదులు, వేల కోట్లతో రాజధానిని నిర్మించి చూపించొచ్చు కదా.! పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రివర్స్ టెండరింగ్‌కి వెళ్ళారు.. కానీ, పోలవరం ప్రాజెక్టుని వేరే చోటకి మార్చలేరు కదా.! అమరావతి విషయంలోనే ఈ ‘స్థాన చలనం’ ఎందుకన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అమరావతిని పక్కన పెట్టి, విజయవాడను రాజధానిగా ప్రకటించొచ్చు. కానీ, విశాఖ వైపు వైఎస్ జగన్ మొగ్గు చూపారంటే, ఎక్కడో వ్యవహారం తేడా కొడ్తోంది. ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ పరంగా చూసుకుంటే, విశాఖ అత్యంత ఖరీదైన నగరం. మరి, ‘ఖర్చు తక్కువ.. అభివృద్ధి ఎక్కువ’ కాన్సెప్ట్ అక్కడ వర్కవుట్ అవుతుందా.? ఏదిఏమైనా, వైఎస్ జగన్ సర్కార్.. మూడు రాజధానుల పేరుతో తప్పటడుగు వేసేసింది.. దాన్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలూ పడ్తోందన్నమాట. కుప్పలు తెప్పలుగా సలహాదారుల్నీ, నామినేటెడ్ పోస్టుల్నీ క్రియేట్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆ విషయంలో ‘ఖర్చు తక్కువ..’ అనే సూత్రాన్ని ఎందుకు పాటించలేదో ఏమో.!
437356 981543As a result youll need ultra powerful online enterprise ideas to keep operating in obtaining into matters right your incredible web-based function. MLM 395823
727143 887658You ought to join in a contest for starters of the highest quality blogs online. I will recommend this page! 173649
308387 278912You produced some decent points there. I looked online for your issue and located most people will go together with with the site. 414825