లోన్ యాప్స్.. ఇటీవలి కాలంలో తరచూ మీడియాలో ఈ అంశం గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు రాజకీయ నాయకులూ ఈ లోన్ యాప్స్ దెబ్బకి విలవిల్లాడుతున్నారన్న వాదన తెరపైకొచ్చింది. ఓ మంత్రి, ఓ మాజీ మంత్రి.. లోన్ యాప్ బాధితులని తేలింది. సాక్షాత్తూ సదరు మంత్రి, సదరు మాజీ మంత్రి.. ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ ఆగడాల గురించి వింటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్స్ కారణంగా బలవన్మరణాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరగవు.? మంత్రి, మాజీ మంత్రికే లోన్ యాప్స్ నిర్వాహకులు ఫోన్లు చేసి బెదిరిస్తోంటే, సామాన్యుల గతేం కాను.?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గనుక అనిల్ కుమార్ యాదవ్.. లోన్ యాప్స్ నిర్వాహకుల బెదిరింపులకు సంబంధించి కాల్ రికార్డుల్ని బయటపెట్టారు. సామాన్యులు అలా చేయలేరు కదా.? 8 లక్షల కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యేని బెదిరించే స్థాయికి లోన్ యాప్స్ నిర్వాహకులు తెగించారంటే, విషయం చాలా చాలా పెద్దది.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురయ్యింది. ఆయన పోలీసులకు సమాచారం అందిస్తే, పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారట. ఆ నిందితుల్ని విడిపించేందుకు 10 మంది ప్రముఖ న్యాయవాదులు రంగంలోకి దిగారట.
ఎంత పెద్ద రాజకీయం తెరవెనుకాల వుంటే, రాజకీయ నాయకుల్ని బెదిరించే స్థాయికి లోన్ యాప్ నిర్వాహకులు ఎదిగి వుండాలి.? చాలా చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన విషయమిది. మంత్రిగారికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసి పోలీసులు చేతులు దులుపుకుంటమాంటే కుదరదు.!
అసలు ఈ లోన్ యాప్స్ నిర్వాహకులకు ఎలాంటి అనుమతులున్నాయి.? ఏయే చట్టాలకు లోబడి లేదా చట్టాల్ని అతిక్రమించి ఆయా వ్యాపారాలు నడుస్తున్నాయి.? అన్నది నిగ్గు తేల్చాల్సిందే. ఓ అంచనా ప్రకారం, వందల్లో వేలల్లో కాదు, లక్షల్లో లోన్ యాప్ బాధితులు వున్నారట.
సో, ఈ లోన్ యాప్స్ వ్యవహారాన్ని వ్యవస్థ మొత్తం సీరియస్గా తీసుకోవాల్సి వుంది. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి వుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై తగిన చర్యలు తీసుకోకపోతే, లోన్ యాప్స్ దెబ్బకి.. ఒకళ్ళో ఇద్దరో కాదు.. వేలల్లో లక్షల్లో బాధితులు బలవన్మరణాలకు పాల్పడే దుస్థితి రావొచ్చు.
142216 591201Completely pent subject matter, regards for entropy. 37142
You’ve gotten probably the greatest webpages. [url=https://sedong.or.kr/bbs/board.php?bo_table=free&wr_id=13301]minolira kopen in Duitsland[/url]