Rowdy Rohini : బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన రోహిణి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రౌడీ రోహిణిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. బుల్లి తెరపై మాత్రమే కాకుండా ఈమధ్య కాలంలో వెండి తెరపై కూడా ఈ అమ్మడు బిజీ అయ్యింది. ముఖ్యంగా ఇటీవల ఈమె సేవ్ ది టైగర్స్ లో పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
కొన్నాళ్ల క్రితం రోహిణికి ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ సందర్భంగా విరిగిన కాలుకు ఐరెన్ రాడ్ వేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఇన్ని సంవత్సరాల పాటు ఆ ఐరెన్ రాడ్ ని అలాగే కాలు లో ఉంచాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ రాడ్ ను తొలగించేందుకు రోహిణి సిద్ధం అయ్యింది.
హైదరాబాద్ లో పలు ఆసుపత్రుల్లో రోహిణి కాలులో ఉన్న రాడ్డును తొలగించేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. దాంతో గతంలో రోహిణికి ఆపరేషన్ చేసి రాడ్ వేసిన ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించుకుంది. అక్కడి వైధ్యులు పది గంటల పాటు కష్టపడి రోహిణి కాలులో ఉన్న ఐరెన్ రాడ్ ని తొలగించారు. రాడ్ కి స్కిన్ పట్టుకుని ఉండటంతో ఎక్కువ సమయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.