ప్రస్తుతం బయోపిక్ ల హవా ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికి బాలీవుడ్ లో అయితే ఈ బయోపిక్ సినిమాల క్రేజ్ ఇంకా తగ్గలేదు. కానీ సౌత్ లో మాత్రం బయోపిక్ సినిమాలకు అంత క్రేజ్ లేదన్నది అందరికి తెలిసిన విషయమే. ఇక బయోపిక్ సినిమాలుగా చరిత్రకారులు, సమాజ సేవకులు, సాంఘ సేవకులు, గొప్ప వ్యక్తుల చరిత్రలు దాటి .. ఇప్పుడు స్కామ్ వీరుల కథలతో కూడా సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు.
తాజాగా రాజకీయ చరిత్రలోనే నిలిచిపోయిన గడ్డి స్కామ్ తో సంచలనం రేపిన రాజయకీయ నాయకుడి జీవితాన్ని సినిమాగా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ గడ్డి స్కామ్ వీరుడు ఎవరో మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది కదా ..!! ఎస్ మీరు ఊహించిన ఈ రాజకీయ నాయకుడే లాలూ ప్రసాద్ యాదవ్.
బీహార్ సీఎం గా చేసిన లాలూ జీవితం సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. లాలూ పాత్రలో ప్రముఖ భోజపురి నటుడు యాష్ కుమార్ నటించనున్నారు. లాలూ భార్య రబ్రీ దేవి పాత్రలో స్మృతి సిన్హా నటిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టి, వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదల చేస్తారట. మరి ఈ స్కామ్ వీరుడి గురించి .. సమాజానికి ఎలాంటి మెసెజ్ ఇస్తారో మరి.
