దేశంలోని ప్రజలందరి మనస్సులో ఒకే ఒక్క ప్రశ్న ఉన్నది… అదేమంటే.. దేశంలో మహిళలపై దాడులకు ఫుల్ స్టాప్ ఎప్పుడు.. ఎలా… అసలు ఆగే మార్గం ఉన్నదా లేదంటే మహిళగా పుట్టినందుకు మగాడి మృగవాంఛకు బలికావాల్సిందేనా.. ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరి మెదళ్లను గొంగళి పురుగులా తొలిచివేస్తున్నది. సమాధానం మాత్రం దొరకడం లేదు. చట్టాలు మారుస్తున్నాం అంటున్నారు. కానీ, తప్పు చేసిన నయవంచకులు, కీచకులు వాటిని చుట్టలుగా మార్చుకొని బయటకు వస్తున్నారు.
బయటకు వచ్చిన వ్యక్తులు సక్రమంగా ఉంటారు అనుకుంటే పొరపాటే.. మళ్ళీ పాత పనులను కంటిన్యూ చేస్తూ.. మహిళలు కనిపిస్తే కామ వాంఛ తీర్చుకోవడం.. ఎదురు తిరిగితే చంపేయడం చేస్తున్నారు. ప్రతిఘటించకుండా మగాడి మృగవాంఛకు మహిళలు బలికావాల్సిందేనా? దిశ ఘటన జరిగిన తరువాత దేశం యావత్తు ఈ అంశంపై గొంతెత్తి అరుస్తున్నా.. జరిగేవి జారుతూనే ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కొన్ని రోజుల క్రితం ఓ కామాంధుడు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతి పోలీసులకు కంప్లైన్ట్ చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు వాడిని వెంటాడి పట్టుకున్నారు. జైలుకు పంపించారు. అంతవరకూ బాగానే ఉన్నది. కానీ, చట్టాల్లోని లొసుగులను అడ్డుగా పెట్టుకొని బయటకు వచ్చాడు.
తనను జైలుకు పంపిన యువతిపై పగ పెంచుకున్నాడు. రాయ్ బరేలిలోని కోర్టుకు హాజరయ్యి వస్తుండగా యువతిని ఐదుగురు యువకులు అడ్డగించి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఆ రక్షించండి అని పెద్దగా అరిచింది. కానీ, చుట్టూ ఎవరూ లేకపోవడంతో అలా కాలుతూనే కిలోమీటర్ దూరం పరుగులు తీసింది. అలా పరిగెడుతూ.. 112 నెంబర్ కు ఫోన్ చేసింది.
ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న పోలీసులు వెంటనే అంబులెన్స్ తో సహా అక్కడికి వచ్చేశారు. కానీ, అప్పటికి ఆ యువతి శరీరం 90శాతం కాలిపోయింది. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ఫోన్ కాల్ ఆధారంగా ఇప్పటికే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మంటల్లో కాలుతున్నా.. పరుగులు తీస్తూ పోలీసులకు ఫోన్ చేసిన ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. కానీ, అప్పటికే శరీరం 90 శాతం మేర కాలిపోయింది. ఇది నిజంగా హృదయ విదారక సంఘటన అనే చెప్పాలి. ఈ దేశం ఎటుపోతుందో ఎవరికి అర్ధం కావడం లేదు.
247023 524007This really is a very exciting write-up, Im looking for this know how. So you comprehend I established your internet internet site when I was looking for sites like my own, so please appear at my web web site someday and post me a opinion to let me know how you feel. 276268
471884 453268You could find two to three new levels inside L . a . Weight loss and any 1 someone is extremely important. Initial stage may possibly be real melting away rrn the body. shed weight 237878