L.K.Advani: రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ (L.K.Advani) ని భారత ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’తో సత్కరించింది. ఈమేరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
‘ఈ తరంలో మనం చూసిన గొప్ప రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరు. ఆయన్ను భారతరత్న పురస్కారంతో గౌరవిస్తున్నాం. క్షేత్రస్థాయి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అద్వానీ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. దేశ ఉప ప్రధానిగా పని చేశారు. సుదీర్థ రాజకీయ జీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. పార్లమెంట్ లో ఆనుభవం ఇప్పటికీ.. ఎప్పటికీ అందరికీ ఆదర్శప్రాయం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. అద్వానీ భారతరత్న పురస్కారానికి అర్హులు. జాతి ఐక్యతకు ఆయన చేసిన కృషి అసామాన్య’మని కొనియాడారు.
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన రధయాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నేటి అయోధ్య రామమందిరం నిర్మాణం సాకారం కావడంలో ఆయన పాత్ర ఎనలేనిది.