తెలంగాణలో హంగ్ రాబోతోందని కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60కి మించి సీట్లు రావని కూడా అన్నారు. తెలంగాణా లో పొత్తులపై కోమటిరెడ్డి ఆయన మాట్లాడుతూ..
‘కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పొగుడుతూ బిజెపి నీ తిట్టారు. సీఎం కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదు. తెలంగాణాలో హాంగ్ అసెంబ్లీ రాబోతోంది. ఎవరికి 60 సీట్లు పైన వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ -బిఅర్ఎస్ లు సెక్యులర్ పార్టీలు. మా నేతలు ఒక్క తాటిపైకి రావడం లేదు. ఇందుకు కారణాలు అనేకం’.
‘అందరూ కలిసి కష్ట పడితే 40 సీట్లు వస్తాయి. ఒక్కరు గెలిపిస్తా అంటే కాని పని. ఆయన ఎవరో అందరికీ తెలుసు. పేరు చెప్పక్కరలేదు. ఒక్క జిల్లాలో కాదు.. రాష్ట్రమంతా పర్యటిస్తా. రూట్ మ్యాప్ ఇవ్వడమే ఆలస్యం. మార్చి మొదటి వారం నుంచి పాదయాత్ర లేదా బైక్ యాత్ర ప్రారంభిస్తా’ అని అన్నారు.
6111 109683Now we know who the ssebnile one is here. Excellent post! 3741
607524 212629But a smiling visitant here to share the really like (:, btw excellent style and design . 584681