Switch to English

కొరివితో తలగోక్కుంటున్న గులాబీ బాస్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగింది. ఉద్యమంలో రాజకీయ నాయకులు పబ్లిసిటీ స్టంట్లు చేశారు.. సామాన్యులే సమిధలయ్యారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు పలువురు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. ‘నేను చచ్చిపోయినా ఫర్లేదు.. ఉద్యమం బతకాలి..’ అంటూ తన జీవితాన్ని కాల్చేసుకున్నాడు శ్రీకాంతాచారి. ఆ శ్రీకాంతాచారి పేరు చెప్పి, టీఆర్‌ఎస్‌ చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. చివరికి ఆ శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం జరిగిందా.? జరగలేదాయె.

ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీని బతికించడం కోసం శ్రీనివాసరెడ్డి అనే ఆర్టీసీ కార్మికుడు తనను తాను తగలబెట్టేసుకున్నాడు. మరో ఆర్టీసీ కార్మికుడూ ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. ‘ఈ మరణాలకు కార్మిక సంఘాల నేతలే బాధ్యత వహించాలి..’ అంటోంది ప్రస్తుత గులాబీ ప్రభుత్వం. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది వ్యవహారం. గతంలో ఆత్మబలిదానాలకు.. అప్పటి ప్రభుత్వాలు బాధ్యత వహించాలట. ఇప్పుడేమో, గులాబీ ప్రభుత్వానికి సంబంధం లేదట. అప్పుడు విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడితే తెలంగాణ కోసమట.. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటే.. అది మూర్ఖత్వమట.

ప్రస్తుతానికైతే కొన్ని ఉద్యోగ సంఘాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలివిగా మేనేజ్‌ చేశారు. కానీ, సాటి ఉద్యోగి తన హక్కుల కోసం ప్రాణాలు అర్పిస్తోంటే, నిస్సిగ్గుగా ఆ ఉద్యమంపై వెకిలి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు.? తెలంగాణ ఉద్యమాన్ని మించి, మరో మహోన్నత ఉద్యమం దిశగా తెలంగాణలో అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు పరాయి పాలనలో.. ఇప్పుడు సొంత పాలనలో.. అంతే తేడా.

ఒక్కటి మాత్రం నిజం.. ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని కేసీఆర్‌ వెటకారం చేస్తున్నారు.. ఆ వెటకారపు వ్యాఖ్యల్ని తెలంగాణ సమాజం హర్షించడంలేదు. రెండు ప్రాణాలు పోయాక అయినా కేసీఆర్‌లో మార్పు వస్తుందా.? అంటే, వచ్చే అవకాశం మాత్రం కన్పించడంలేదు. కానీ, తెలంగాణ ఉద్యమంలో కేంద్రం మెడలు వంచిన తమకు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడం పెద్ద కష్టమేమీ కాదని తెలంగాణ సమాజం అంటోంది. కేసీఆర్‌లో ఎందుకీ మొండి వైఖరి.? అన్నది టీఆర్‌ఎస్‌ శ్రేణులకే అర్థం కాని ప్రశ్నగా మారిపోయిందిప్పుడు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...