Switch to English

కుమార్తె కవితపై గులాబీ బాస్ కేసీఆర్ నజర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవితవ్యంపై ఆమె తండ్రి, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో కాస్త వెనకబడి తొమ్మిది సీట్లు గెలుచుకోగలిగారు. అయితే, నిజామాబాద్ స్థానం నుంచి పోటీచేసిన సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమి చెందడం కేసీఆర్ కు ఇబ్బందిగా పరిణమించింది. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.

ఆ ఓటమి అనంతరం కవిత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. లోక్ సభ ఎన్నికల పలితాలు వచ్చి మూడు నెలలు పూర్తికాగా, ఆమె పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అటు నియోజకవర్గానికి గానీ, ఇటు తెలంగాణ భవన్ లో గానీ కనిపించడంలేదు. పూర్తిగా హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెను రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు పదవీకాలం వచ్చే ఏడాది మేతో ముగుస్తుంది.

తద్వారా ఏర్పడే ఖాళీని కవితతో భర్తీ చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. తాజాగా టీఆర్ఎస్ వర్గాల్లో మరో మాటలు వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్థానం ఖాయమని, ఆయన్ను కేబినెట్లోకి తీసుకుని.. కవితకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా వచ్చే ఏడాది రాజ్యసభకు పంపించే వరకు కుమార్తెను రాజకీయంగా ప్రజల్లోనే ఉంచేలా కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.

అయితే, ఇది నిజం కాదని మరికొందరు స్పష్టంచేస్తున్నారు. ‘‘వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్.. క్రమంగా పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. పలు అంశాల్లో దూసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన్ను సారథి బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఎంత మాత్రం ఉండదు. పైగా త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ఇలాంటి ప్రయోగాలు చేయరు. కేటీఆర్ ను కేబినెట్లోకి తీసుకున్నప్పటికీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన్నే కొనసాగిస్తారు’’ అని టీఆర్ఎస్ నేత ఒకరు పేర్కొన్నారు. కవితను రాజ్యసభకు పంపించే అవకాశాలే ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...