Switch to English

కాంగ్రెస్‌కు ‘జీవ‌న్’ రేఖ‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

క‌మ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు జోరుమీదున్న స‌మ‌యంలోనూ ఉత్త‌ర‌తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బ‌లంగా నిలిచింది. అలాంటిది ఇప్పుడు పూర్తిగా అస్తిత్వంపైనే అనుమానాలు వ్య‌క్త‌మయ్యే ప‌రిస్థితికి చేరుకుంది. టీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో రోజురోజుకూ కుదేల‌వుతోంది.

వ‌రుస‌గా ఎమ్మెల్యేలు గులాబీ కండువా క‌ప్పుకునేందుకు క్యూ క‌ట్ట‌డం, కార్య‌క‌ర్త‌లు కూడా ఇక దిక్కులేని ప‌రిస్థితుల్లో కాంగ్రెస్‌కు రాం రాం చెప్ప‌డంతో ఇక ఆ పార్టీ ప‌ని అయిపోయిన‌ట్లేన‌నే భావ‌న వ్య‌క్త‌మైంది. రెండోసారి కేసీఆర్ గెలిచాక ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది.

ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు మిన‌హా మిగిలిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లంతా వ‌స్తున్నారని.. కాంగ్రెస్ ఖాళీ అవుతోదంటూ టీఆర్ఎస్ కూడా ఫీల‌ర్లు వ‌దులుతుండ‌డంతో ఇది జ‌ర‌గ‌క త‌ప్ప‌దేమో అన్న అనుమానం స‌గటు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లో వ్య‌క్త‌మైంది. ప్ర‌జ‌ల గుండెల్లోనూ త‌మ పార్టీకి చోటులేదేమోనన్న అనుమానం క‌లిగింది.

ఇలాదీనస్థితిలో.. వెంటిలేట‌ర్‌పై ఉన్నతెలంగాణ కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీగా జీవ‌న్ రెడ్డి గెలుపు అమృత‌పు చుక్క‌లా మారింది. ఇక ప‌ని అయిపోయిందునుకున్న స‌మ‌యంలో.. కార్య‌క‌ర్త‌ల‌కు కొండంత బ‌లాన్నిచ్చింది.

ఉత్త‌ర తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు ఉన్న బ‌ల‌మైన నేతల్లో జీవ‌న్ రెడ్డి అగ్ర‌గ‌ణ్యులు. క‌మిటెడ్ కార్య‌క‌ర్త‌గా.. అనుభ‌వ‌జ్ఞుడైన నేత‌గా జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గాన్ని పార్టీ కంచుకోట‌గా మార్చారు. పార్టీపై వ్య‌తిరేక‌త ఉన్న స‌మ‌యంలోనూ.. వ్య‌క్తిగ‌తంగా ఓట్లు సంపాదించే గొప్ప నేత జీవ‌న్ రెడ్డి.

2019 ఎన్నిక‌ల్లో ఈయ‌న్ను ఓడించేందుకు టీఆర్ఎస్ చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదు. ఏకంగా ఎంపీ క‌విత జ‌గిత్యాల‌లో కూర్చుని త‌న మ‌నిషి సంజ‌య్‌ను గెలిపించుకునేందుకు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. అయితే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజ‌యంతో జీవ‌న్ రెడ్డి కూడా త‌న ప‌ట్టుకోల్పోయార‌ని భావిస్తున్న త‌రుణంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఆ పార్టీకి వ‌రంగా మారాయి. చివ‌రిసారిగా అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నంలో కాంగ్రెస్ అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది.

ఈ విజ‌యం కేవ‌లం అద్భుతం మాత్ర‌మే కాదు. కాంగ్రెస్ ప‌ని అయిపోయిందంటూ గులాబీ ద‌ళం చేస్తున్న ప్ర‌చారానికి బ్రేక్ వేసేందుకు ప‌నికొస్తుంది. అంతేకాదు.. టీఆర్‌ఎస్‌ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థిపై అఖండ విజ‌యం సాధించ‌డం ద్వారా.. ఇంకా కాంగ్రెస్ జిందా హై అని చెప్పుకునేందుకు.. మ‌ళ్లీ పుంజుకుంటామ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు మ‌నోధైర్యం ఇచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

తెలంగాణ స‌మాజంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఈ ఎన్నిక‌లు బ‌య‌ట‌పెట్టాయని కాంగ్రెస్ చెబుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఈ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఓటేసే స‌మ‌యంలోనూ అకౌంట్ల‌లో రైతుబంధు డ‌బ్బులు ప‌డ్డ మెసేజ్ లు త‌మ విజ‌యానికి బ్రేక్ వేసాయంటోంది.

జీవ‌న్ రెడ్డి పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల కార్య‌క‌ర్త‌. అందుకే ఎట్టిప‌రిస్థితుల్లోనూ పార్టీమారే అవ‌కాశం ఉండ‌దు. ఇది పార్టీ శ్రేణుల‌కు ధైర్యాన్నిచ్చే అంశం. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న క‌సి కాంగ్రెస్‌లో క‌నిపించింది. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, ఉత్త‌ర తెలంగాణ ముఖ్య‌నేత‌లు క్షేత్ర‌స్థాయిలో తిరిగారు.

ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల‌ను క‌ల‌వ‌డం.. వ‌రుస‌ స‌మావేశాలు ఏర్పాటుచేసి.. ఓట్లేయాల‌ని కోరడం క‌లిసొచ్చింది. ఈ ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌క‌పోతే ఇక పార్టీ ప‌రిస్థితి అంతే ప‌రిస్థితుల్లో బాధ్య‌త‌ను పంచుకుని ప్ర‌చారం చేశారు. దాని ఫ‌లిత‌మే ఈ రిజ‌ల్ట్స్.

ఇది పీసీసీ నేత‌ల‌కో, అధిష్టానానికో బూస్ట్ ఇచ్చే అంశం అనేక‌న్నా.. పార్టీ మార‌డం త‌ప్ప వేరే అవ‌కాశం లేద‌నుకున్న కేడ‌ర్‌కు వెయ్యిఏనుగుల బ‌లాన్నిచ్చింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మ‌రింత ఉత్సాహంతా ప‌నిచేసేందుకు శక్తినిచ్చింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...