Switch to English

చంద్రబాబు ఆదేశాలతో మారిన సీన్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. నామినేష్ల ప్రక్రియ ముగిసింది. ఉపసంహరణల పర్వం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్ఠానం ఎక్కడికక్కడ నష్టం కలిగిస్తారనుకుంటున్న వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొద‌లు పెట్టింది.. కళ్యాణదుర్గంలో టీడీపీ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసారు.. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి తాను టీడీపీలోనే ఉన్నానని, అలాంటిది ఇప్పుడు తనను కాదని మరొకరికి టికెట్‌ ఇవ్వడమేమిటని ఆయన ప్రశిస్తున్నారు.

దీన్ని వ్యతిరేకిస్తూ తాను బరిలో ఉంటానని.. ఆయన అమరావతిలో చంద్రబాబుతోనే చెప్పి మరీ వచ్చారు. అదే ప్రకారం ఆయన తన అనుచరగణంతో అట్టహాసంగా స్వతంత్ర అభ్యర్థిగా కళ్యాణదుర్గంలో నామినేషన్‌ దాఖలు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ టికెట్‌ దక్కించుకున్న ఉమామహేశ్వరనాయుడు ఉన్నంను కలిసి తన విజయం కోసం సహకరించాలని కోరారు.. అయినా ఆయన పట్టు వీడకుండా తాను పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు.

జిల్లా నాయకులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో హనుమంతరాయ చౌదరితో సీఎం మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ హనుమంతరాయచౌదరికి టీడీపీ జిల్లా ఎన్నికల బాధ్యతలు, ఆ తరువాత పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలతోపాటు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేలా హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో కళ్యాణదుర్గం టీడీపీకి కొంత అసమ్మతి సెగ తగ్గినట్టేననే అభిప్రాయాలున్నాయి.

జేసీ చొరవతో దారిలోకి గుంతకల్లు గుప్తా

ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చొరవతో సీఎం చంద్రబాబు మాట్లాడిన తరువాత గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా దారిలోకి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. జేసీ డిమాండు మేరకు గుప్తాకు టీడీపీ టికెట్‌ ఇవ్వలేదనే కారణంతో ఆయనను జనసేనలో చేర్పించారనే ప్రచారం జరిగింది. ఇదే విషయం జేసీతో సీఎం చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం.

దీంతో మళ్లీ మధుసూదన్‌ గుప్తా జనసేన నుంచి వేసిన నామినేషన్‌ వెనక్కు తీసుకునేలా ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ టీడీపీ అభ్యర్థి జితేంద్రగౌడ్‌ విజయం కోసం కృషిచేసిన అనంతరం గుప్తాకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో గుంతకల్లు టీడీపీ అభ్యర్థికి కూడా అసంతృప్తుల పోటు తప్పినట్టేననిపిస్తోంది.

ఇటీవలే రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దారిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అనంతపురంలోని ఎంపీ నివాసంలో కాలవ శ్రీనివాసులును, దీపక్‌రెడ్డిని ఒక చోట కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చారు. వారిద్దరి మధ్య గల చిన్నచిన్న పొరపొచ్చాలు తొలగించారు.

దీంతో అక్కడ కాలవ శ్రీనివాసులు విజయానికి దీపక్‌రెడ్డి కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇక కదిరిలో ఎంపీ నిమ్మల కిష్టప్ప చొరవతో ఎమ్మెల్యే చాంద్‌బాషాను కలిసి..తన విజయానికి సహకరించాలని టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ కోరిన విషయం విదితమే. అప్పటికేమో పరిస్థితులు చక్కబడినట్టు కనిపించినా ఆ తరువాత వారిద్దరి మధ్య సంబంధాలు అంతగా మెరుగుపడలేదనే అభిప్రాయాలున్నాయి.

శింగనమలలో కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీబాల అక్కడి అభ్యర్థి బండారు శ్రావణి ప్రచారానికి అంతగా కలిసి రావడం లేదని తెలుస్తోంది. శ్రావణి మాత్రం గత ఎన్నికల్లో తాము యామినీబాల విజయం కోసం పనిచేశామని, ఇప్పుడు తన విజయానికి ఆమె కచ్చితంగా పనిచేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి విజయానికి కృషి చేయడానికి కలిసి రాకుండా కొందరు అసంతృప్తులు దూరంగా ఉంటున్నారు. పోటీలో ఉన్న చౌదరి వారిని కులుపుని పోయే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. కానీ వారు అందుబాటులో లేరని తెలిసింది. వారంతా టీడీపీకి విధేయులే కాబట్టి తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...