Switch to English

అమ్ముడుపోని ఓట్లు ఎవరివో తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. అభ్యర్థులు ఖర్చు ఎంత అయిందో లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, జనసేన అభ్యర్థులు మాత్రం ఇలాంటి లెక్కలకు దూరంగా ఉన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన జనసేన.. ఎన్నికల్లో డబ్బులు పంచకపోవడమే ఇందుకు కారణం. డబ్బులు పంచితేనే రాజకీయాల్లో మనగలం అనే ఒరవడికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయారంగేట్రం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ విషయంలో ముందుగానే తన వైఖరిని స్పష్టంచేశారు. డబ్బులు పంచడం అనే దుస్సంప్రదాయానికి తాను వ్యతిరేకినని, ఎన్నికల్లో ఎవరూ కూడా డబ్బులు పంచొద్దని అభ్యర్థులకు స్పష్టంచేశారు. చెప్పినట్టుగానే ఆయన పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో డబ్బుల్లేని రాజకీయాలు చేసి చూపించారు.

అలాగే, జనసేన నుంచి పోటీచేసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అధినేత ఆదేశాలను పాటించారు. ఒకటి రెండు చోట్ల మాత్ర జనసేన అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలతో పోటీపడి డబ్బులు పంచినట్టు సమాచారం. అయితే, ఇది తమ అధినేతకు తెలియకుండా, తాము డబ్బులు పంచకపోతే ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఆయా అభ్యర్థులు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలు చాలా చోట్ల ఓటర్లకు డబ్బులు పంచాయి. రూ.500 నుంచి రూ.5000 వరకు ఓటర్లకు ముట్టజెప్పాయి. ఓటర్లు కూడా రెండు పార్టీల దగ్గరా డబ్బులు తీసుకున్నారు. అయితే, డబ్బులు తీసుకోకుండా ఓటేసింది మాత్రం జనసేన ఓటర్లే. అంటే ఒకవిధంగా అమ్ముడుపోని ఓటర్లు ఎవరైనా ఉన్నారా అంటే అది జనసేన ఓటర్లే అని చెప్పొచ్చు.

టీడీపీ, వైఎస్సార్ సీపీల్లోనూ డబ్బులు తీసుకోకుండా ఓటేసినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆయా పార్టీల మీద ఉన్న అభిమానంతో వారు ఓటేసినప్పటికీ, ఆయా పార్టీలకు పడిన ఓట్లలో డబ్బులు తీసుకుని వేసినవి కూడా ఉన్నాయి. ఒక్క జనసేనకు పడిన ఓట్లు మాత్రం ఒక్క పైసా కూడా తీసుకుకోండా వేసినవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ పార్టీ డబ్బులు పంచలేదు. అంటే, ఈ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లన్నీ పూర్తి స్వచ్ఛందంగా వచ్చిన అమ్ముడుపోని ఓట్లు.

పైగా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారంతా స్వచ్ఛందంగా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ వచ్చి జనసేనకు ఓటేశారు. ‘మా ఊళ్లో టీడీపీ, వైసీపీలు చెరో రూ.వెయ్యి పంచాయి. మేం మాత్రం హైదరాబాద్ నుంచి రూ.2వేలు పెట్టి టికెట్ కొని ఓటేయడానికి వచ్చాం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కు పవన్ శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అలాంటివారిని ప్రోత్సహించాలి. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటును కొనాలని రాజకీయాలు పార్టీలు భావించడం ఎంత తప్పో, ఓటును అమ్ముకోకూడదని తెలిసి కూడా పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్న జనాలది అంతకంటే తప్పు’ అని విజయవాడకు చెందిన రాజు చెప్పాడు.

జనసేనకు పడిన ఓట్లన్నీ ఎలాంటి ప్రలోభాలకూ గురికానివేనని, తమవి అమ్ముడుపోని ఓట్లని గర్వంగా కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు. మరి రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జనసేనకు ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియాలంటే మే 23 వరకు వేచిచూడక తప్పదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...