Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: మళ్ళీ లాక్‌డౌన్‌ మోడ్‌లోకి వెళ్ళాల్సిందేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ దేశంలో తీవ్ర రూపం దాల్చుతోంది. సగటున 15 వేలకు పైగా కేసులు నిత్యం నమోదవుతున్నాయి గత కొద్ది రోజులుగా. ఏమో, నేటి పరిస్థితి ఎలా వుంటుందో.! 16 వేలు దాటుతుందో, ఆ పై 17 వేలకు పైగా కేసులు ఈ రోజు నమోదు కాబోతున్నాయో ఇప్పుడే చెప్పలేం. రేపు ఎలా వుంటుందో.. ఇంకో నాలుగైదు రోజుల తర్వాత సగుటన రోజుకి 20 వేల కేసులకు పైగా నమోదయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ‘స్వేచ్చ’ ఎక్కువైపోవడం వల్లే ఇంతలా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయా.? అంటే, లాక్‌డౌన్‌ అమల్లో వుండగానే పెరుగుదల షురూ అయ్యింది.. అదిప్పుడు కొనసాగుతుందంతేనన్న వాదనా లేకపోలేదు. మరోపక్క, కేసులు ఎక్కువగా నమోదువుతున్న ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు చేస్తున్నారు. గతంలో ఒకట్రెండు ప్రాంతాలకు పరిమితమైన కరోనా పాజిటివ్‌ కేసులు, ఇప్పుడు అన్ని చోట్లకీ వ్యాపించేశాక.. లాక్‌డౌన్‌ కఠినతరం.. అన్న మాటకు అర్థం ఏమన్నా వుందా.?

హోమ్ క్వారంటైన్‌కి ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్న దరిమిలా.. హోమ్ కంటెయిన్‌మెంట్‌ జోన్స్‌ ఎక్కువయిపోయాయి. అయితే, వీటి పట్ల స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలూ లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, కరోనా పట్ల భయాందోళనలే నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణ పోటీ పడ్తున్నాయి కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో. ‘ఇంకోసారి దేశంలో కరోనా లాక్‌డౌన్‌కి అవకాశం లేదు.. సడలింపులు మాత్రం పెరుగుతాయి..’ అని కేంద్రం చెబుతోంది. మద్యం షాపులతో వేగం పుంజుకున్న కరోనా ప్రవాహం.. ఇప్పుడిప్పుడే పీక్స్‌కి చేరుకుంటోంది. ఇదెంత ఎక్కువ కేసుల నమోదు దాకా వెళుతుందో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి.

ఫలానా జిల్లాలో లాక్‌డౌన్‌, ఫలానా పట్టణంలో లాక్‌డౌన్‌.. అంటూ నిత్యం వింటోన్న వార్తలతో మొత్తంగా ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత, ఇప్పుడే సగటు ప్రజానీకం ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. మళ్ళీ లాక్‌డౌన్‌ వార్తలు విన్పిస్తుండడంతో.. తమ జీవితాలు ఆర్థికంగా ఇంకెంత నాశనమవుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు సగటు ప్రజానీకం.

మొత్తంగా చూస్తే, లాక్‌డౌన్‌ అనేది కరోనా కేసుల పెరుగుదలను కొన్ని రోజులపాటు తగ్గించిందేమోగానీ.. పూర్తిగా ఆపలేకపోయిందన్నమాట. దీన్ని ప్రభుత్వాల వైఫల్యంగానే ప్రజలు చూస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. తమని ప్రభుత్వాలు అస్సలేమాత్రం పట్టించుకోవడంలేదన్నది ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శ. ‘దేశం గాడిన పడుతోంది.. రాష్ట్రాలు పుంజుకుంటున్నాయి..’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డప్పు కొట్టుకుంటున్నా, గ్రౌండ్‌ లెవల్‌లో అంతకు భిన్నంగా అత్యంత దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...