Switch to English

‘మేడ్‌ ఇన్‌ చైనా’పై భారతీయుల ప్రేమ చచ్చిపోతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మేడ్‌ ఇన్‌ చైనా.. ఆ పేరు చూస్తే చాలు.. ఎగబడి కొనేస్తాం. లక్షల ధర పలికే ఖరీదైన టీవీల దగ్గర్నుంచి రూపాయి ఖరీదుండే గుండు సూది వరకు.. చైనా ప్రోడక్ట్స్‌కి వుండే గిరాకీనే వేరు. డ్రాగన్‌ దేశం నుంచి దిగుమతి అయ్యే ఈ వస్తువుల పట్ల భారతీయులకు అంత ప్రేమ ఎందుకు.? ఎందుకంటే, మార్కెట్‌లో లభ్యమయ్యే చాలా వస్తువులతో పోల్చితే, చైనా ప్రోడక్ట్స్‌ ధరలు తక్కువే మరి. అదీ అసలు సంగతి.

క్వాలిటీ సంగతి దేవుడెరుగు.. ఐటమ్ చాలా గొప్పగా కన్పించేస్తుంది. అదే చైనా ప్రోడక్ట్‌ ప్రత్యేకత. పైగా, ఒక్కోసారి క్వాలిటీ విషయంలోనూ చైనానే బెస్ట్‌. పది రూపాయలు పెట్టి కొన్న ఓ ఆట బొమ్మ.. పాతికేళ్ళ లైఫ్‌ చూసేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే, భారతీయులకి ‘మేడిన్‌ చైనా’ అంటే అంత పిచ్చి.

ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘బ్యాన్‌ చైనా ప్రోడక్ట్స్‌’ అనే డిమాండ్‌ ఇప్పుడు తెరపైకి వచ్చింది గనుక. ‘మేం చైనా ప్రోడక్ట్స్‌ని బ్యాన్‌ చేస్తున్నాం..’ అని పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా పబ్లిసిటీ స్టంట్లు షురూ చేశారు. సాధ్యమయ్యే పనేనా ఇది.? అని ఒక్కసారి ఆలోచిస్తే.. ‘అసాధ్యమైతే కాదుగానీ.. మనోళ్ళకు అంత చిత్తశుద్ధి లేదు’ అనే సమాధానం ఖచ్చితంగా వస్తుంది.

మన దేశంలో వాడుతున్న మొబైల్‌ ఫోన్ల లెక్కలు తీస్తే, చైనా ఆధిపత్యమే ఎక్కువ. ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌లో సింహభాగం చైనాకే దక్కుతుందేమో. ఇవన్నీ ఉత్తుత్తి లెక్కలు కాదు.. నిఖార్సయిన లెక్కలే. చైనా – భారత్‌ మధ్య సరిహద్దు గొడవలు ఇప్పటివి కావు. చైనా చేతిలో ఓడిపోయాం.. చైనాకి ధీటుగా బదులిచ్చాం.. చైనా, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి వ్యతిరేకంగా నినదిస్తూనే వుంది.

భారతదేశ ప్రయోజనాల్ని దెబ్బతీసేలా చైనా ప్రవర్తిస్తూనే వుంది. మరి, 20 మంది సైనికుల మరణంతో.. రాత్రికి రాత్రి ‘బ్యాన్‌ చైనా ప్రోడక్ట్స్‌’ అంటే ఎలా.? చైనా వల్ల మన దేశానికి చాలా నష్టం జరిగింది, జరుగుతూనే వుంది.. చాలా సందర్భాల్లో ‘బ్యాన్‌ చైనా ప్రోడక్ట్స్‌’ నినాదం తెరపైకొచ్చింది. కానీ, చైనా ప్రోడక్ట్స్‌ని బ్యాన్‌ చేశామా.? లేదే.! పైగా, చైనా పారిశ్రామికవేత్తలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాయి మన ప్రభుత్వాలు. ప్రపంచీకరణలో భాగంగా అలాంటివన్నీ తప్పకపోవచ్చనుకోండి.. అది వేరే విషయం.

చైనా మ్యాప్‌లను తగలబెట్టడం, చైనా నాయకుల దిష్టిబొమ్మలు తగలబెట్టడం.. ఇదంతా నూటికి నూరుపాళ్ళు మన ఆవేదనని తెలియజేయడమే. కానీ, ఆ కసి.. ఆ కోపం.. ఆ తెగువ.. నీటి బుడగలా మారిపోకూడదు. చైనా ప్రోడక్ట్స్‌ల్ని బ్యాన్‌ చేయాల్సి వస్తే.. మళ్ళీ ‘మేడిన్‌ చైనా’ అన్న మాటే మన దేశంలో వినకూడదు. మరి, అంత చిత్తశుద్ధి మనలో వుందంటారా.? ఇది సగటు భారతీయుడికి అగ్ని పరీక్ష. ఇది మనందరి బాధ్యత.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...