కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి సమీపంలో ఒక యువతిని కాలువలో నెట్టి తాను కూడా దూకి ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈత వచ్చిన అతడు కొంత దూరంకు బయటకు రాగా ఆమె నాలుగు కిలోమీటర్ల దూరం నదిలో కొట్టుకు పోయింది. రైతులు ఆమె కేకలు విని ఆమెను బయటకు లాగారు. అంత సమయం ఆమె ప్రాణాలతో ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆమెను రైతులు కాపాడి అసలు విషయం అడగ్గా విస్తు పోయే విషయం చెప్పింది. భర్త తనను నదిలో తోసేశాడు అంటూ కేసు నమోదు పెట్టింది.
బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. 2016లో పత్తి భాస్కర్ మరియు రామలక్ష్మిలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనాధ అయిన రామలక్ష్మి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇద్దరి సంసారం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగింది. ఈమద్య కాలంలో గొడవలు వస్తున్నాయి. దాంతో గుళ్లదూర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్దాం అంటూ రామలక్ష్మిని వెంట పెట్టుకుని బైక్ పై భాస్కర్ వెళ్లాడు. ఒక కాలువ వద్ద బైక్ ఆపి సెల్ఫీ తీసుకుందాం అంటూ కాలువ వద్దకు వెళ్లాడు.
ఆ సమయంలో ఆమెను కాలువలో తోసి తాను కూడా బైక్ తో సహా కాలువలో పడ్డాడు. ఈత వచ్చిన భాస్కర్ బయట పడ్డాడు. ఆమె చనిపోవడం ఖాయం అనుకున్నాడు. కాని అనూహ్యంగా అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. నాలుగు కిలోమీటర్లు కొట్టుకు పోయిన ఆమెను రైతులు కాపాడారు. అప్పటి వరకు ఆమె ప్రాణాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించింది. కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్ ను అరెస్ట్ చేశారు.
545605 295899Xanax (Alprazolam) is used to treat anxiety disorders and panic attacks. Alprazolam is in a class of 886272
236780 585075I see something genuinely unique in this website . 457830
442585 457281Hello! I merely want to make a enormous thumbs up with the amazing info youve here during this post. We are returning to your blog for additional soon. 50239