Switch to English

అరెస్ట్‌ తీరుపై కోర్టు కామెంట్స్‌: సర్కారుకి చెంపపెట్టు లాంటివేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అని మంత్రులు చెబితే సరిపోదు.. అధికార పార్టీ చెబితే సరిపోదు. గత కొంత కాలంగా రాజకీయాలు ఎలా మారుతున్నాయో అంతా చూస్తూనే వున్నాం. మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌ వ్యవహారంలో ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడింది నిజమే అయితే, ఆయన్ని ఎవరూ సమర్థించరు. అలాగని, ఆయన్ని అరెస్టు చేసిన తీరునీ ఎవరూ సమర్థించే పరిస్థితి వుండదు. ఆపరేషన్‌ జరిగిన వ్యక్తిని పోలీసులు సుమారు 600 కిలోమీటర్ల దూరం కారులో తరలించడం అంటే చిన్న విషయం కాదు కదా.! ‘అబ్బే, ఆ సంగతి మాకు తెలియదు..’ అని చెబుతున్నారు ఏసీబీ అధికారులు. ఇదే విషయాన్ని న్యాయస్థానానికీ విన్నవించారు.

‘దారి మధ్యలో ప్యాడ్స్‌ మార్చుకున్నారు..’ అని కూడా ఏసీబీనే చెబుతోంది. సర్జరీ కారణంగా అయిన గాయం ఇంకా మానకముందే అంత దూరం ప్రయాణించే క్రమంలో, గాయం నుంచి రక్తం కారడంతో, ప్యాడ్స్‌ మార్చుకోవాల్సి వచ్చింది అచ్చెన్నాయుడికి. అరెస్ట్‌ చేసిన అచ్చెన్నాయుడిని ఆసుపత్రికి తరలించి, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక, మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చడం, ఈ క్రమంలో ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించాలని అప్పట్లోనే న్యాయమూర్తి చెప్పడం తెల్సిన విషయాలే. గాయం పెద్దదవడంతో ఇంకోసారి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది అచ్చెన్నాయుడికి.. అదీ ప్రభుత్వాసుపత్రిలోనే.

విషయం ఇంత క్లియర్‌గా వున్నప్పుడు, ఏసీబీ అంత లైటర్‌ వీన్‌లో ఎలా వ్యవహరించగలిగింది.? అన్న చర్చ జరగడం సహజమే. తాజాగా, న్యాయస్థానం అరెస్టు చేసిన తీరు సహా, అచ్చెన్నను ఆసుపత్రి నుంచి జైలుకు తరలించే విషయంలో వ్యవహరించిన తీరుని కూడా తప్పు పట్టింది. నేరం వేరు, పాపం వేరు.. అని న్యాయస్థానం వ్యాఖ్యానించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

తప్పు చేస్తే అచ్చెన్నాయుడు తప్పించుకునే అవకాశముండదు. తప్పు చేయకుండా ఆయనకు శిక్ష పడే అవకాశమూ వుండదు. ఈలోగా, అత్యంత అమానవీయంగా ఆయన పట్ల ఏసీబీ ఎందుకు వ్యవహరించింది.? అని ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడంలేదు. ‘కేవలం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోంది. ఇప్పుడు కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంప పెట్టు. పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు.? వారిపై నానా రకాల ఒత్తిళ్ళూ వున్నాయ్‌..’ అని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...