ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను రిలీజ్ చేస్తూ ఉన్నాయి. పనిలో పనిగా మన హీరో నాని (Nani) కూడా ఒక కొత్త పార్టీ పెట్టేశారు. అంతేకాదు ఎన్నికల్లో తనని గెలిపించాలంటూ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదంతా నిజం కాదండోయ్. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమా ప్రమోషన్స్ లో భాగమే. ప్రస్తుతం ఉన్న ఎలక్షన్స్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని మూవీ టీం ఇలా కొత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా నాని రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి హామీల మీద హామీలు ఇచ్చేశారు.
యూత్ ని దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో తయారు చేశామని.. తమ ఓటు ‘హాయ్ నాన్న (Hai Nanna)’ మూవీకి వేయాలంటూ నాని సోషల్ మీడియాలో ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్ కూడా ఉండటంతో ఆ మ్యాచ్ టికెట్ లో డిస్కౌంట్ ఇస్తారట. అంతే కాదండోయ్ యూత్ రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్స్, లైటింగ్ సెటప్ కూడా ఏర్పాటు చేస్తారట ఇలాంటి ఎన్నో క్రేజీ హామీలతో నాని రిలీజ్ చేసిన మేనిఫెస్టో ని మీరు కూడా చూసేయండి.