Switch to English

బిగ్‌ హీట్‌: హేమ అసహనం వెనుక వున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

మూడు వారాలు కనీసం బిగ్‌ హౌస్‌లో వుండాలనుకున్న హేమకి బిగ్‌ బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌ పెద్ద షాకే ఇచ్చింది. అయినా, హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యింది టైటిల్‌ గెలవడానికే తప్ప, మొదటి వారమో.. రెండో వారమో బయటకు వచ్చేయడానికా.? ఏ కంటెస్టెంట్‌ కూడా అలాగని చెప్పరు. కానీ, హేమ మాత్రం తాను మూడు వారాల పాటు కనీసం హౌస్‌లో వుండాలనుకుంటున్నట్లు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బయటకొచ్చాక, బిగ్‌బాస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది హేమ.

హౌస్‌లో తనకు సంబంధించిన ఫుటేజ్‌ని తప్పుగా చూపించారన్నది ఆమె చేస్తున్న ప్రధాన ఆరోపణ. తన మీద నెగెటివిటీ పెంచేలా బిగ్‌బాస్‌ వ్యవహరించారంటూ, హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాక హేమ ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివరించింది. మరోపక్క, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమేననీ, ఒకే ఒక్క వారం కోసం ఆమెతో ముందస్తుగా ఒప్పందం చేసుకున్నారనీ.. ఆ వ్యూహం ప్రకారమే, ఆమెను ఫస్ట్‌ వీకెండ్‌లో ఎలిమినినేట్‌ చేశారనీ ప్రచారం జరుగుతోంది.

‘హేమ ఔట్‌, తమన్నా సింహాద్రి ఇన్‌..’ అంటూ, హేమ పేరు ‘ఎలిమినేషన్‌ నామినేషన్స్‌’లోకి రాకముందే గాసిప్స్‌ విన్పించాయి. ఇదిలా వుంటే, హేమ ద్వారా మేగ్జిమమ్‌ నెగెటివిటీని పెంచి, బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి క్రేజ్‌ తీసుకురావాలనే ప్రయత్నం తెరవెనుక గట్టిగా జరుగుతోందట. దీనికోసం హేమకి బిగ్‌బాస్‌ నిర్వాహకులు బాగానే సమర్పించుకున్నారనీ, గత ఎపిసోడ్స్‌కి సంబంధించి కూడా ఇలాంటి పబ్లిసిటీ జిమ్మిక్స్‌ జరిగాయని అంటున్నారు.

కాగా, బిగ్‌ హౌస్‌లో పరిణామాల పట్ల సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్వేతా రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బిగ్‌బాస్‌లో అంతా అడ్డగోలు వ్యవమారమేనని మరోసారి ఆమె మండిపడ్డారు. తనతో ఒప్పందం కుదుర్చుకుని మోసం చేశారని బిగ్‌బాస్‌ నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్నారామె. హేమని కలుస్తాననీ, ఆమెతో కలిసి పోరాటం చేస్తానని చెబుతున్నారు శ్వేతా రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగార్జున బిగ్‌బాస్‌ని వదులుకోవాల్సిందేనన్నది శ్వేతారెడ్డి డిమాండ్‌. ఇలాంటి వివాదాలు బిగ్‌బాస్‌కి ఉచితంగా పబ్లిసిటీ తెచ్చిపెడతాయి తప్ప.. బిగ్‌బాస్‌కి ఏమాత్రం నష్టం లేదన్నది మరో వాదన.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...