Switch to English

హ్యాపీ మదర్స్‌ డే: అమ్మంటే ఓ అద్భుతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఎవర్నయినా ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మే. ఆ అమ్మని తలచుకోకుండా రోజు ప్రారంభమవుతుందా? అలాంటిది, ఓ రోజుని ప్రత్యేకంగా ‘మదర్స్‌ డే’ అని జరుపుకోవడమేంటి.! శ్వాస ఎలా పీల్చుకుంటామో, అమ్మని తలచుకోవడం కూడా అంతే. అమ్మ లేకపోతే, మనిషి మనుగడకి అవకాశమే లేదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా అమ్మతో కూడా అవసరం లేకుండా మనుషులు జన్మించేస్తున్నారంటూ వార్తలు వింటున్నాం. ఇక, అమ్మతో పనేంటి.? అనుకునేవారూ ముందు ముందు కన్పిస్తారు. ‘అమ్మ’ అంటే ఇదీ అని, వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది.

ముందే చెప్పుకున్నట్టు, ప్రపంచానికి మనిషిని అమ్మే పరిచయం చేస్తుంటుంది. అంటే, మనిషి ప్రస్థానం అమ్మ నుంచే ప్రారంభమవుతుందన్నమాట. ఆ అమ్మ కోసం ఓ రోజున ఇంకాస్త ప్రత్యేకంగా కేటాయిస్తే అది తప్పేమీ కాదు. అది అమ్మ మీద మన అభిమానాన్ని ఇంకొంచెం ఎక్కువగా చాటుకోవడానికి ఉపయోగపడుతుందని సంబరపడాల్సిందే. అది అమ్మ మీద చూపించే ప్రేమ మాత్రమే కాదు, మనల్ని మనం గౌరవించుకునే వైనమది.

బాధ కలిగితే ‘అమ్మా’ అంటాం, భయమేస్తే ‘అమ్మో’ అంటాం. ఎందుకంటే, అమ్మతోనే మొదలైంది మన ప్రయాణం. ఆ అమ్మ రక్తమనే చనుబాల రూపంలో మనకి మొదటి ఆహారమయ్యింది. ఆ అమ్మ లాలింపులోనే ప్రేమానురాగాల్ని తెలుసుకున్నాం. మనిషిగా ఎలా మనుగడ సాగించాలో కూడా అమ్మే మనకి పాఠాలు నేర్పుతుంది. అలాంటి అమ్మ, ఇప్పుడు అందరికీ చులకనైపోతుందనుకోండి. అది వేరే సంగతి. ‘మా పిచ్చి తల్లి’ అన్నట్లుగా సినిమాల్లో ‘అమ్మ’ పాత్రని ఎంత దారుణంగా చూపిస్తున్నారో, ఆ అమ్మ పాత్రల చుట్టూ ఎంత కర్కశాన్ని టీవీ సీరియళ్ళలో అద్దుతున్నారో చూసి చప్పట్లు కొడుతూనే వున్నాం.

అమ్మ మీద ఈ ‘కొత్త’ ప్రేమ ఇక్కడితో ఆగిపోలేదు. ఎవర్నన్నా తిట్టడానికి కూడా ‘అమ్మ’ ప్రస్తావన తప్పడంలేదు. ఆఖరికి మహిళలు కూడా ‘ఆకాశంలో సగం, అన్నింటా సగం’ అనుకుంటున్నారు, అమ్మని తిట్టేందుకు పురుషులతోపాటే పోటీ పడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఇలాంటోళ్ళంతా ‘హ్యాపీ మదర్స్‌ డే’ అంటూ ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు, సోషల్‌ మీడియాలో పోస్టింగులతో ‘అమ్మ’కి ‘మదర్స్‌ డే’ శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు.

అమ్మ అంటే ఓ అద్భుతం. అమ్మ అంటే ఆది పరాశక్తి. ఒక్క రోజు కాదు కదా, వారంలో ఏడు రోజులూ, నెలలో 30 రోజులూ, ఏడాదికి 365 రోజులూ సరిపోవు అమ్మ గురించి మాట్లాడుకోవడానికి. అమ్మని గుర్తు చేసుకోవడమంటే, అమ్మని గౌరవించడం కాదు. మనల్ని మనం గౌరవించుకోవడం. మన నుంచి ఏమీ ఆశించేది కాదు అమ్మంటే.. ఆ అమ్మ పేరు చెప్పి అడ్డగోలు పనులు చేయకుండా వుండడమే అమ్మకి మనమిచ్చే అరుదైన గౌరవం.

సాటి మహిళలో అమ్మని చూడగలిగిననాడు, ప్రతి అమ్మకీ మనం గౌరవం ఇచ్చినట్లే. అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగిపోవాలి.. భార్యలపై వేధింపులు తగ్గిపోవాలి.. ఇవన్నీ జరిగినప్పుడే అమ్మలందరూ ‘హ్యాపీ మదర్స్‌ డే’ని ఫీలవుతారు. అలాంటి రోజొకటి వచ్చేందుకు మనవంతు ప్రయత్నం చేద్దామా.? పబ్లిసిటీ ‘మదర్స్‌ డే’ల పేరుతో వికారపు చేష్టలకే పరిమితమవుదామా.? మగాళ్ళు మాత్రమే కాదు, సాటి మహిళలు కూడా ‘అమ్మ’ గురించి ఈ ఒక్క మదర్స్‌ డే సందర్భంగా అయినా చిత్తశుద్ధితో, నిబద్ధతతో, నిస్వార్ధంతో ఆలోచిద్దాం. హ్యాపీ మదర్స్‌ డే.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...