కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా తో జరిగిన మూడో టెస్టులో భారత్ ను ఓటమి నుంచి గట్టెక్కిస్తూ హనుమ విహారి క్రీజ్ లో పాతుకుపోయాడు. 161 బంతులు ఎదుర్కొని కేవలం 23 పరుగులే చేశాడు. దీనిపై మంత్రి సుప్రియో స్పందిస్తూ హనుమ విహారిని తప్పు బడుతూ ట్వీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ లో ‘విహారి’కి బదులు పొరబాటున ‘బిహారి’ అని రాశారు.
దీనిని గమనించిన హనుమ విహారి.. ‘హనుమ విహారి’ అని మంత్రికి రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. కేంద్రమంత్రికి ఇది కౌంటర్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రిప్లై అదిరిపోయేలా ఇచ్చావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 109 బంతులు ఆడి 7 పరుగులు చేసి ఇండియా గెలుపును చంపేశాడు. ఇలాంటి విహారి ఒక నేరస్థుడంటూ సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి. పైగా.. తనకు క్రికెట్ గురించి ఏమీ తెలీదని కూడా రాసుకున్నారు.
463151 347942Precisely what I was searching for, thankyou for putting up. 940672
941876 467112Some actually superb info , Sword lily I found this. 956369