New Cities: భారత్ (India) లో రోజురోజుకీ పెరుగుతున్న జనాభా (Population) , పట్టణీకరణ నేపథ్యంలో కొత్త నగరాల సృష్టిపై కేంద్రం దృష్టి పెట్టిందని సమాచారం. ఈక్రమంలో కొత్తగా 8 నగరాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. దేశంలోని నగరాలు, పట్టణాలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా పరిశీలనలో ఉందని సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
ఇందుకు సంబంధించి 15వ ఆర్ధిక సంఘం పరిశీలన చేస్తోందని అంటున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ఇండోర్ (Indore) లో జరిగిన అర్బన్ 20 సమావేశం అనంతరం కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్ డైరక్టర్ ఎంబీ సింగ్ దీనిపై మాట్లాడారు. 15వ ఆర్ధిక సంఘం ప్రతిపాదించిన కొత్త నగరాల ఏర్పాటుపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు రాష్ట్రాలు ఇప్పటికే 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి నివేదికలు కూడా పంపాయని.. వీటిలో 8 నగరాల సృష్టిపై ఆలోచిస్తున్నామన్నారు.
Good day! Do you know if they make any plugins to protect against
hackers? I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any suggestions?
I’m very pleased to find this site. I want to to thank you for ones time due to this wonderful read!! I definitely savored every bit of it and i also have you book marked to check out new information in your web site.