సౌత్ లో ప్రస్తుతం కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. తెలుగు మరియు తమిళంలో ఈమె స్టార్ లకు సూపర్ స్టార్ లకు మరియు చిన్న హీరోలకు అందరికి కూడా మోస్ట్ వాంటెడ్ గా మారింది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ అవుతుంటే కొన్ని మాత్రం తీవ్రంగా నిరాశ పర్చుతున్నాయి. ముఖ్యంగా ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రేక్షకుల ముందు బొక్క బోర్లా పడ్డాయి. ఈమద్య వచ్చిన పెంగ్విన్ మరియు మిస్ ఇండియా సినిమాల్లో ఏమాత్రం ఈమె ఆకట్టుకోలేక పోయింది. కమర్షియల్ హీరోయిన్ గా నెం.1 స్థానంలో ఉన్న కీర్తి సురేష్ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఎట్టకేలకు కీర్తి సురేష్ అభిమానులు కోరుకున్నట్లుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలను కొంత కాలం పక్కకు పెట్టాలని నిర్ణయించుకుందట. గుడ్ లక్ సఖి సినిమా తర్వాత కీర్తి సురేష్ ఇప్పట్లో లేడీ ఓరియంటెడ్ మూవీల్లో కనిపించబోవడం లేదు. కేవలం హీరోల సరసన గ్లామర్ డాల్ గా కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే ఈమె కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న అన్నాత్తే, సర్కారు వారి పాట, రంగ్ దే మరి కొన్ని సినిమాలు కూడా వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కమర్షియల్ హీరోయిన్ గా ఆఫర్లు తగ్గినప్పుడు మళ్లీ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఈమె నటించే అవకాశం ఉందంటున్నారు.
376777 733089Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this incredible like you organize your company at the moment. educational 564433
780924 250006Aw, this became an incredibly nice post. In thought I would like to set up writing like that furthermore – taking time and actual effort to create a fantastic article but what / items I say I procrastinate alot by means of no means appear to get something completed. 821987