Switch to English

సాక్షికి కరోనా సెగ.. నిజాలివీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రముఖ మీడియా సంస్థ ‘సాక్షి’కి కరోనా సెగ తగిలిందని, హైదరాబాద్ లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఓ రిపోర్టర్ కి పాజిటివ్ నిర్దారణ అయిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సంస్థలో పనిచేసే సదరు రిపోర్టర్ కి కరోనా సోకినా కార్యాలయం యథావిధిగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలేమిటో తెలుగు బులెటిన్ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

సాక్షి దినపత్రికలో ఓ సీనియర్ రిపోర్టర్ కి కరోనా సోకిన మాట వాస్తవమే. విధి నిర్వహణలో భాగంగా పలు ప్రెస్ మీట్లకు వెళ్లిన క్రమంలో ఆయనకు ఈ వైరస్ సోకినట్టు సమాచారం. వాస్తవానికి లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత సాక్షిలో వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సినవారు మినహా మిగిలినవారందరికీ వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించారు. తప్పనిసరిగా రావాల్సినవారికి కూడా వారంలో మూడు రోజులు సెలవు వచ్చేటట్టు చూశారు.

ఈ నేపథ్యంలో రిపోర్టందరూ గత రెండు నెలలుగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఒకరిద్దరు మినహా రిపోర్టర్లలో ఎవరూ ఆఫీసుకు రాలేదు. ప్రస్తుతం కరోనా వచ్చిన రిపోర్టర్ సైతం గత కొంతకాలంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. గత వారంలో మాత్రం ఒకటి రెండుసార్లు ఆఫీసుకు వచ్చినట్టు సమాచారం. అయితే, ఆయనకు మూడు రోజుల క్రితం జ్వరం, దగ్గు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కూడా ఇది సోకినట్టు సమాచారం.

అయితే, పిల్లలకు మాత్రం కరోనా నిర్ధారణ కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సాక్షి కార్యాలయంలో ఆయన పనిచేసే ఫ్లోర్ ను శానిటైజ్ చేశారు. నిజానికి సాక్షి కార్యాలయం కరోనా నియంత్రణ చర్యలు మొదటి నుంచీ సాగుతున్నాయి. ఎక్కడికక్కడ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. స్టాఫ్ మొత్తానికి మాస్కులు కూడా పంపిణీ చేశారు. అలాగే ప్రతిరోజూ కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో బుధవారం కూడా సదరు రిపోర్టర్ పనిచేసే ఫ్లోర్ ను మరింత శుభ్రం చేశారు. వాస్తవానికి ఆయన ఆఫీసుకు వచ్చింది చాలా తక్కువ. వచ్చినప్పుడు కూడా ఎన్ 95 మాస్కుతోనే వచ్చారు. అయితే, ప్రత్యేక యంత్రాన్ని తెప్పించి మరీ సిబ్బంది అందరినీ అందులో నుంచి నాలుగైదు సార్లు నడిపించారనే ప్రచారం మాత్రం నిజం కాదు. సదరు రిపోర్టర్ కి కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉన్నాయని సమాచారం. ఆయన వైద్యుల పర్యవేక్షణలో వారు సూచించిన మందులు వాడుతూ ఇంట్లోనే క్వారం టైన్ అయినట్టు తెలుస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...