Switch to English

చిరంజీవి స్కూల్స్‌ వ్యాపారం: ఇదీ నిజం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి విద్యా వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారనీ, చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ పేరుతో ఇప్పటికే విద్యా సంస్థలు స్థాపించారనీ పెద్దయెత్తున ‘రచ్చ’ సినీ, రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న సంగతి తెల్సిందే. విద్య ఎప్పుడో వ్యాపారంగా మారిపోయింది. కార్పొరేట్‌ విద్యా సంస్థల్ని కొందరు సినీ ప్రముఖులు కూడా రన్‌ చేస్తున్న మాట వాస్తవం. సినీ నటుడు మోహన్‌బాబు, ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. అయితే, చిరంజీవి మాత్రం విద్య పేరుతో వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో లేరట. మరి, చిరంజీవి పేరుతో స్కూల్స్‌ ఎలా వచ్చాయి? అంటే, దాని వెనుకాల పెద్ద కథే వుంది.

చిరంజీవి అభిమాని ఒకరు చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ పేరుతో ఈ విద్యా సంస్థలకి శ్రీకారం చుట్టారు. చిరంజీవి మీద అమితమైన అభిమానంతో ఆయన ఆ స్కూల్స్‌కి ‘చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌’ అని పేరు పెట్టడమే కాదు, గౌరవ వ్యవస్థాపకుడిగా చిరంజీవి పేరుని పెట్టుకున్నారు. చిరంజీవితోపాటు నాగబాబు, చరణ్‌ పేర్లు కూడా ‘గౌరవ’ కోటాలో పెట్టేశాడు. దాంతో, చిరంజీవికి వ్యతిరేకంగా పెద్ద యెత్తున రచ్చ జరుగుతోంది. చిరంజీవి కుటుంబం డబ్బు కోసం కార్పొరేట్‌ విద్యారంగంలోకి అడుగుపెట్టి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడబోతోందంటూ కొందరు దుష్ప్రచారం అప్పుడే మొదలు పెట్టేశారు.

విషయం కొంత ఆలస్యంగా మెగా కాంపౌండ్‌కి చేరినా, తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు కన్పిస్తోంది. సదరు సంస్థ గురించి వాకబు చేసి, ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందో మెగా కాంపౌండ్‌ తరఫున ఓ ప్రముఖుడు తెలుసుకున్నారట. జరుగుతున్న దుష్ప్రచారాన్ని సదరు సంస్థ దృష్టికి తీసుకెళ్ళేసరికి, తాను చేసిన ఓ ప్రయత్నం చిరంజీవి ఇమేజ్‌ని ఇంతలా డ్యామేజ్‌ చేస్తుందని అనుకోలేదంటూ సదరు అభిమాని, ఆ మెగా ప్రముఖుడితో చెప్పుకుని వాపోయారట. చివరికి, తన తప్పు తెలుసుకున్న ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశాడు.

చిరంజీవికి వున్న లక్షలాది, కోట్లాది అభిమానుల్లో తానూ ఒకడినని, పేద తరగతి విద్యార్థుల కోసం సేవాభావంతోనే ఈ విద్యా సంస్థను స్థాపించడం తప్ప, ఇందులో లాభాపేక్ష అన్న మాటకు తావులేదనీ, ఈ సంస్థతో చిరంజీవికిగానీ, ఆయన కుటుంబ సభ్యులకుగానీ సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు ఆ ప్రెస్‌ నోట్‌లో. గౌరవ వ్యవస్థాపకుడంటూ చిరంజీవిని పేర్కొనడం వెనుక ఆయన మీద తనకున్న అభిమానమే కారణం తప్ప, ఇంకో కారణం లేదని, చిరంజీవితో ఈ స్కూల్స్‌కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ వ్యవస్థాపకుడు, చిరంజీవి అభిమాని అయిన జె. శ్రీనివాసరావు.

అయితే, చిరంజీవిని గౌరవ ఫౌండర్‌గా, నాగబాబుని అధ్యక్షులుగా, చరణ్‌ని గౌరవ ఛైర్మన్‌గా చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ నియమించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేర్లను వాడుకోవడం నూటికి నూరుపాళ్ళూ తప్పిదమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పూర్తి సేవాభావంతో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ని నిర్వహిస్తున్నా, ఆ సంస్థపై కొందరు పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తూనే వున్నారు. ఈ తరుణంలో అభిమాని అని చెప్పుకుంటోన్న వ్యక్తి, చిరంజీవి విషయంలో ఇంత రిస్క్‌ ఎందుకు చేసినట్లు?

ఏది ఏమైనా, ఇలాంటి విషయాల్లో చిరంజీవి కుటుంబం ఒకింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే. లేకపోతే, అభిమానుల పేరుతో చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యుల ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...