Switch to English

కరోనా మరణాల ‘కిరికిరి’ లెక్కలేంది ఈటెల సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ సోకి చనిపోతే.. కరోనా మరణంగానే లెక్కల్లో చూపించాలి. అంతేగానీ, క్యాన్సర్‌ బాధితుడికి కరోనా వచ్చింది కాబట్టి.. ఆ బాధితుడు చనిపోతే అది కరోనా మరణం కాదని అనగలమా.? గుండె జబ్బులున్నోళ్ళు, బీపీ – షుగర్‌ లాంటి అనారోగ్య సమస్యలున్నవాళ్ళు.. కరోనాతో చనిపోతే, కరోనా మరణాల లెక్కల్లో వారి పేర్లు వుండవంటే ఎలా.? ‘మా లెక్కలు ఇంతే.. ఆరోగ్యంగా వుండి కరోనాతో చనిపోతేనే, వాటిని కరోనా మరణాల లెక్కల్లో చూపిస్తాం..’ అని అసలు గుట్టు తాపీగా విప్పారు తెలంగాణ హెల్త్‌ మినిస్టర్‌ ఈటెల రాజేందర్‌. ఈ మేరకు ఓ పత్రికలో కథనం రావడంతో ఇప్పుడీ వ్యవహారం పెను దుమారం రేపుతోంది.

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటేసింది.. తెలంగాణలో మాత్రం ఆ వెయ్యిలో సగం కూడా లేవు. కరోనా పాజిటివ్‌ కేసుల వ్యవహారం కూడా ఇలానే వుంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు జరుగుతోంటే, అందులో సగం కూడా తెలంగాణలో టెస్టులు జరిగిన పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణలో కరోనా పరిస్థితిపై తీవ్ర భయాందోళనలున్నాయి.

ఈ సమయంలో, కరోనా మరణాలపై సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడమే కాదు.. ప్రజల్ని మరింత భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే, తెలంగాణలో కరోనా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు పదే పదే మొట్టికాయలేసిన విషయం విదితమే. ఇప్పుడు ఈ కరోనా మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగారి కామెంట్లు కోర్టు దృష్టికి వెళితే ఇంకేమన్నా వుందా.? ఇంత నిర్లక్ష్యమా.! దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా కరోనా విషయంలో చాలా బాగా చేసేస్తున్నామని మొదట్లో తెలంగాణ ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్పుకున్నారు.

యుద్ధ ప్రాతిపదికన కరోనా బాధితులకు చికిత్స కోసం ‘టిమ్స్’ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తున్నట్లూ అప్పట్లో ప్రకటించారు. కానీ, కొద్ది రోజుల క్రితమే ఆ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది.. ఇప్పటికీ ఈ ఆసుపత్రి విషయమై భిన్న కథనాలు విన్పిస్తూనే వున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకి వెళ్ళి జనం జేబులు ఖాళీలు చేసుకుంటున్నారు.. అప్పుల పాలైపోతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలపై వస్తున్న దిగ్భ్రాంతికరమైన కథనాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ ఓ ఎత్తు.. రికార్డు స్థాయిలో మరణాలు చోటు చేసుకుంటున్నా, తెలంగాణ ప్రభుత్వం ‘దాపరికం’ పాటిస్తోందన్న విమర్శలు ఇంకో ఎత్తు.

గుట్టు చప్పుడు కాకుండా కరోనా మృతుల అంత్యక్రియలు జరిపేస్తూ లెక్కలు తక్కువగా చూపిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు దిక్కెవరు.? మంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చెబుతారు.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...