Switch to English

చంద్రబాబు రప్పించారా? ఆయనే వచ్చారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

జాతీయ రాజకీయాలపై ఇద్దరు చంద్రుల దృష్టి గట్టిగానే వుంది. ఆంధ్రప్రదేశ్‌ చంద్రుడికి కేంద్రంలో చక్రం తిప్పిన అనుభవం చాలానే వుంది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్ని ఆయన చాలి గట్టిగా ప్రభావితం చేసిన విషయాన్ని ఎలా కాదనగలం? తెలంగాణ చంద్రుడూ తక్కువేమీ కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ దిగొచ్చేలా చేయడమే కాదు, జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల మద్దతుని తెలంగాణ కోసం కూడగట్టిన ఘనుడాయన. చంద్రబాబు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ తరఫున బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తోంటే, కేసీఆర్‌ తీరు ఇంకోలా కనిపిస్తోంది. ఆయన ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటున్నారు.

తమిళనాడుకి ఇలా కేసీఆర్‌ వెళ్ళి డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌తో సమావేశమయ్యారో లేదో, అలా చంద్రబాబు అదే స్టాలిన్‌తో ఫోన్‌లో మంతనాలు షురూ చేశారు. అంతే, డీఎంకే ముఖ్య నేత దొరై మురుగన్‌ అమరావతిలో వాలిపోయారు. చంద్రబాబు రప్పించారా.? డీఎంకే చీఫ్‌ స్వయంగా దొరై మురుగన్‌ని అమరావతికి రప్పించారా? అన్నది వేరే చర్చ. చంద్రబాబుకి జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఫాలోయింగ్‌కి దీన్ని నిదర్శనంగా టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

అయితే, ఎన్నికలకు ముందు ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే చోటు చేసుకుంటాయి. పైగా, చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు చేయడంలో దిట్ట. డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌కీ, చంద్రబాబుకీ సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసీ, ఆ బంధాన్ని తెగ్గొట్టడానికి కేసీఆర్‌ చెన్నయ్‌ వెళ్ళిన మాట వాస్తవం. అయితే, అక్కడ కేసీఆర్‌ పప్పులుడకలేదు కూడా. ఈ అంశంపై ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో తీవ్రమైన చర్చే జరుగుతోంది.

మే 23న ఎన్నికల ఫలితాలు రానుండడంతో, ఈలోగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు. ఫలితాలొచ్చాక ఎలాగూ ఇంకోసారి ఢిల్లీకి చంద్రబాబు వెళ్ళే అవకాశముంటుంది. ఈ జాతీయ టూర్ల కారణంగా చంద్రబాబు, ‘మహానాడు’ కార్యక్రమాన్ని కూడా ఈ ఏడాదికి పక్కన పెట్టినట్లు కన్పిస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మహానాడు నిర్వహించడం కొంత కష్టం కావొచ్చు. అయితే, దాన్ని రద్దు చేయలేదు. వాయిదా దిశగా మాత్రమే ఆలోచిస్తున్నాం’ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కొంత ‘కవర్‌’ చేసే ప్రయత్నం చేశారు.

ఇదిలా వుంటే, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని టీమ్స్‌ని తయారు చేసి, దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆ టీమ్‌లను పంపించాలనే యోచనలో వున్నారట. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీల్ని కలుపుకుపోయే దిశగా ఈ టీమ్‌లు ఆయా పార్టీల అధినేతలతో మంతనాలు జరపనున్నాయని సమాచారమ్‌. ఆ టీమ్స్‌లో ఒకటి, తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేతతో కూడా చర్చలు జరుపుతాయని తెలుస్తోంది.

ఇంకోపక్క, టీఆర్‌ఎస్‌ అధినేతతో చర్చలు అవసరం లేదనే భావన టీడీపీలో అంతర్గతంగా విన్పిస్తోంది. కేసీఆర్‌తోపాటు జగన్‌ కూడా బీజేపీకి అనుకూలంగానే వున్నారనీ, పైకి వారిద్దరూ ఏం చెబుతున్నా, మే 23 తర్వాత కేసీఆర్‌, జగన్‌ కలిసి ఎన్డీయేలో భాగస్వాములుగా మారతారని టీడీపీ భావిస్తోంది. ‘అది టీడీపీ భయం మాత్రమే. మేం కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం పాటిస్తున్నాం. జగన్‌ కూడా ఇదే భావనతో వుంటారని ఆశిస్తున్నాం’ అని టీడీపీ నేతలు అంటున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...