Ashish Reddy : టాలీవుడ్ హీరోల్లో చాలా మంది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లిలు అయ్యాయి. ప్రభాస్ తో పాటు ఒకరు ఇద్దరు మినహా పెద్దగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లేరనే చెప్పాలి. తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యాడు.
దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి వివాహ నిశ్చితార్థం నిన్న గురువారం సైలెంట్ గా జరిగింది. శిరీష్ తనయుడు అయిన ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమా తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా మరో సినిమాని మొదలు పెట్టాడు. రెండో సినిమా రాకుండానే ఆశిష్ పెళ్లికి రెడీ అయ్యాడు.
ఏపీకి చెందిన వ్యాపారవేత్త కుమార్తె అయిన అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆశిష్ రెడ్డి వివాహ నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుంది అంటూ ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి రౌడీ బాయ్ ఆశిష్ పెళ్లి నిశ్చితార్థం సైలెంట్ గా జరగడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. నిన్నంత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిశ్చితార్థం గురించి ప్రచారం జరగలేదు.