డైరెక్టర్ హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో రాసిన ఓ డైలాగ్ ‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు’. అప్పట్లో విజిల్స్ వేయించిన ఈ డైలాగ్ ఇప్పుడు ఆయన సినిమాకే పర్ఫెక్ట్ గా సరిపోయింది. చివరి నిమిషంలో ‘వాల్మీకి’ అన్న టైటిల్ ‘గద్దల కొండ గణేష్’గా మారడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు అని అనుకున్నారు కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాంటివేమీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని ఆపలేవని ‘గద్దల కొండా గణేష్’ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్లోనే మొదటి సారి కంప్లీట్ మాస్ అవతార్ లో కనిపించడం, అందులోనూ కంప్లీట్ నెగటివ్ షేడ్స్ ఉన్న గ్యాంగ్ స్టర్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. వరుణ్ నటనకి ఫిదా అయినా తెలుగు ప్రేక్షకుల పాజిటివ్ పబ్లిక్ టాక్ రావడంతో మ్యాట్నీ షోస్ నుంచి సడన్ గా బుకింగ్స్ పెరిగాయి. నైట్ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. దాంతో వరుణ్ తేజ్ కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు సినిమాగా నిలిచింది. మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణలో మొత్తంగా 5.84 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో వరుణ్ తేజ్ గత రికార్డ్ అయిన F2 మొదటి రోజు 4.96 కోట్ల షేర్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఏరియాల వారీగా ‘గద్దల కొండ గణేష్’ షేర్స్ కలెక్షన్స్ రిపోర్ట్..
నైజాం – 1.86 కోట్లు
సీడెడ్ – 0.81 కోట్లు
గుంటూరు – 0.71 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.70 కోట్లు
తూర్పు గోదావరి – 0.54 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.59 కోట్లు
కృష్ణా – 0.42 కోట్లు
నెల్లూరు – 0.21కోట్లు
మొత్తం షేర్ – 5.84 కోట్లు
