టైటిల్ మీద అక్కసు వెల్లగక్కగలిగారుగానీ.. సినిమా ప్రభంజనాన్ని అయితే అడ్డుకోలేకపోయారు. ‘గద్దలకొండ గణేష్’గా మారిన ‘వాల్మీకి’ అంచనాలకు తగ్గట్టే సూపర్బ్ ఓపెనింగ్స్ కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్నింగ్ షో, మ్యాటనీ నుంచే ప్రభంజనం ఓ స్థాయిలో కన్పించింది. అది సాయంత్రానికి మరింతగా పెరిగినట్లు రిపోర్ట్స్ వస్తుండడం గమనార్హం. సీడెడ్‌లోని కొన్ని చోట్ల సినిమా విడుదలపై కొంత గందరగోళం నిన్నంతా క్రియేట్ అయిన దరిమిలా, ఆ ఎఫెక్ట్ కొంత కన్పించింది.
పైగా, థియేటర్ల వద్ద పోలీసులు – ఆందోళనకారుల హంగామా, ఓపెనింగ్స్ మీద కొంత నెగెటివ్ ప్రభావం చూపింది. అయితే, అది చాలా తక్కువని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా కర్నూలు జిల్లాలోనూ, అనంతపురం జిల్లాలోనూ కొన్ని ఎంపిక చేసుకున్న థియేటర్ల వద్ద ఆందోళనకారుల హడావిడితో, థియేటర్లకు వచ్చిన జనం కొంత నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.
Also Read: ‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ & రేటింగ్
మార్నింగ్ షోకి ఈ ఇంపాక్ట్ కొంత ఎక్కువగా కన్పిస్తే, మధ్యాహ్నానికి చల్లారిపోయింది. సాయంత్రానికి థియేటర్ల వద్ద ‘రచ్చ రచ్చ’ కన్పించడం గమనార్హం. ఇప్పటిదాకా వరుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా అంటే అది ‘ఎఫ్-2’. ఈ ఏడాది సంక్రాంతికి సైలెంట్‌గా వచ్చి, సంచలన విజయం సాధించింది ‘ఎఫ్-2’. ఆ సినిమా వసూళ్ళ స్థాయిలో సోలోగా వరుణ్ తేజ్ ఈసారి ఓపెనింగ్స్ కొల్లగొట్టాడని అంటున్నారు.
అయితే, రేపు ఉదయానికి కంప్లీట్ డిటెయిల్స్ వస్తాయి. సంక్రాంతి సీజన్ ‘ఎఫ్-2’కి బాగా కలిసొచ్చింది. కానీ, టైటిల్ వివాదం కారణంగా ‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ‘వాల్మీకి’కి కాస్త ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవం. మరోపక్క, ఆ వివాదమే ఈ సినిమాకి చివరి నిమిషంలో మరింత హైప్ తెచ్చిందనే వాదనలూ లేకపోలేదు.
