కూతురు ప్రేమని కాదని వేరే యువకుడితో పెళ్లి ఏర్పాట్లు చేసిందో తల్లి. కుమార్తె ఎదురు తిరగడంతో బంధువులతో కలిసి ఆమెను హత్య చేసింది. కూతుర్ని ఓ ఇంటిదాన్ని చేయకపోగా చంపుకుని నిందితురాలిగా కటకటల్లో ఉంది. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.
పుదుకొటై జిల్లా అలంగుడి సమీపంలోని తిరువారంకులంలో సావిత్రి(20) ఆమె తల్లితో కలిసి నివసిస్తోంది. ఈమె తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయాడు. పుదుకొట్టైలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న సావిత్రి స్థానికంగా నివసించే వివేక్ (20)తో మూడేళ్ల నుంచి ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవాలన్న వీరి నిర్ణయానికి సావిత్రి తల్లి శాంతి అంగీకరించలేదు. దీంతో పెళ్లి చేసుకోవాలని నాలుగు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీనిపై శాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్నేహితుల సాయంతో కారులో వెళుతూండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సావిత్రి మేజర్.. వివేక్ మేజర్ అర్హతకు నాలుగు నెలలు ఉందని తెలుసుకున్నారు. నాలుగు నెలల తర్వాత వీరిద్దరికీ కలిపి పెళ్లి చేయాలని తల్లికి, బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. కానీ.. సావిత్రికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఇందుకు ససేమిరా అన్న సావిత్రిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. సావిత్రి కనపడటం లేదని వివేక్ పోలీసులను ఆశ్రయించాడు.
శాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా సావిత్రి ఎక్కడికి వెళ్లిందో తమకు తెలీదని చెప్పుకొచ్చింది. తమదైన పద్ధతిలో విచారించగా సావిత్రిని ఉరి వేసి తమ బంధువులతో కలిసి చంపేశామని నిజం ఒప్పుకుంది. దీంతో శాంతి, ఏడుగురు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు.
252330 965761Basically wanna remark which you have a quite good internet site , I enjoy the layout it truly stands out. 786403
804176 908717I like this web site so significantly, saved to favorites . 327914
886486 924568Thank you for your extremely good details and feedback from you. car dealers in san jose 139279
18339 88436Wonderful paintings! This really is the kind of information that need to be shared about the internet. Disgrace on Google for now not positioning this publish upper! Come on over and speak more than with my internet site . Thanks =) 925659