సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కి ముగ్గురు భార్యలున్నారనీ, నలుగురో ఐదుగురో పిల్లలు వున్నారనీ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. నిజమే, పవన్ కళ్యాణ్‌కి మూడు సార్లు పెళ్ళయ్యింది. మొదటి భార్యకి విడాకులు ఇచ్చాక, హీరోయిన్ రేణు దేశాయ్‌తో సహజీవనం, ఆ తర్వాత ఆమెను పెళ్ళి చేసుకోవడం తెల్సిన విషయాలే. రేణు దేశాయ్‌తో కొన్ని కారణాలతో చట్టబద్ధంగా విడిపోయిన పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవాని పెళ్ళాడారు. ఇదీ అందరికీ తెల్సిన విషయమే. ఇందులో దాపరికాలేమీ లేవు.
కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ భార్యల ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది.? పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు.? అన్నది జగన్ ప్రశ్న కావొచ్చు. ప్రశ్న అక్కడికే పరిమితమైతే అది రాజకీయమెలా అవుతుంది.? బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు, అక్కడ చాలామంది ప్రజానీకం, తమకు ఉపయోగపడే విషయాల గురించి ఏదైనా ప్రకటన వస్తుందేమోనని చూస్తారు. కానీ, జగన్ తన స్థాయిని ఇక్కడ పూర్తిగా దిగజార్చేసుకున్నారు.
వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తే, ఆ తర్వాత వ్యవహారాలు చాలా ఛండాలంగా వుంటాయన్నది జగమెరిగిన సత్యం. గతంలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద జగన్ ఇలాగే వ్యాఖ్యానిస్తే, దానికి కౌంటర్‌గా పవన్ అభిమానులు, సోషల్ మీడియాలో జగన్ కుటుంబ సభ్యుల గురించి ఏ స్థాయిలో ట్రోలింగ్ చేశారో చూశాం. అప్పుడంటే, పవన్ ఓ రాజకీయ పార్టీకి అధినేత, ప్రతిపక్ష నేత. అప్పుడూ ఆయన హుందాతనం ప్రదర్శించాల్సి వుంది. అప్పుడూ, ఇప్పుడూ వైఎస్ జగన్ హుందాతనం అన్న మాటకే అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నది జనసేన తరఫున వస్తున్న స్పందన.
295101 470137An fascinating discussion is worth comment. I believe that you need to write much more on this subject, it may possibly not be a taboo topic but typically people are not enough to speak on such topics. Towards the next. Cheers 42456
946415 579091Some genuinely wonderful weblog posts on this internet website , regards for contribution. 713752
107125 951932Simply wanna input which you have a extremely nice site , I enjoy the pattern it actually stands out. 862264