Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటించిన భోళా శంకర్ (Bhola Shankar) సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. ఆగష్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ అనే పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
వాల్తేరు వీరయ్యను మించి భోళా శంకర్ భారీ బ్లాక్ బస్టర్ సాధించబోతోందని రివ్యూ ద్వారా తెలుస్తోంది. చిరంజీవి రేంజ్ కు తగ్గ ఫైట్స్, పాటలు, డ్యాన్స్, ప్రేక్షకుల్ని అలరించే కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నాయని సమాచారం. చిరంజీవి నుంచి మరో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఖాయమని టాక్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈనెల 6న జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు మరింత పెరగనున్నాయని చెప్పాలి.