TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) (TTD) నూతన ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన చైర్మన్ గా ఉండనున్నారు. గతంలో కూడా టీటీడీ చైర్మన్ గా భూమన పని చేశారు.
ప్రస్తుత చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి పదవీ కాలం మరో వారం రోజుల్లోపే ముగియనుంది. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈనేపథ్యంలో టీటీడీ చైర్మన్ నియామకం అనివార్యమైంది. ఈక్రమంలో టీటీడీ చైర్మన్ పదవికి రాష్ట్ర ప్రభుత్వం భూమన వైపే మొగ్గు చూపింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకూ భూమన టీటీడీ చైర్మన్ గా పని చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూమనను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత టీటీటీ బోర్డులో చైర్మన్ తో కలిపి 25మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు. చైర్మన్ గా నియమించిన సందర్భంలో సీఎం జగన్ (CM YS Jagan) కు భూమన కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.