Switch to English

చంద్రబాబు కొత్త కథ: 4 పాయింట్‌ ఫార్ములా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఇంకో పది రోజుల్లో ఎటూ ఫలితాలు వెల్లడవుతాయ్‌. ఈలోగా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా హర్రీగా వర్రీ అవుతున్నట్లు కన్పిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నం ఈ తరుణంలో కొంత హాస్యాస్పదంగానే మారుతోంది. ఎన్నికలకు ముందరేమో, ‘పార్టీ కోసం గట్టిగా పనిచేయాలి. చాలామంది పార్టీని లైట్‌ తీసుకుంటున్నారు. సీరియస్‌గా పనిచేయకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టం’ అని పార్టీ నేతలపై చంద్రబాబు పలు సమీక్షల్లో అసహనం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే.

కానీ, ఇప్పుడు చంద్రబాబు మాటలు ఇంకోలా వుంటున్నాయి. నాలుగు విధాలుగా సమీక్షలు జరిపామనీ, అన్ని కోణాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం ఖరారుగానే కనిపిస్తోందనీ చంద్రబాబు చెబుతున్నారు. ఆ ఫోర్‌ పాయింట్‌ ఫార్ములా ఏంటో చంద్రబాబుకే తెలియాలి. నేతల పనితీరు, ప్రభుత్వ పథకాలు, పార్టీ బలోపేతమవడం, వ్యతిరేకత తగ్గించుకోవడం.. ఇలాంటివేవో చంద్రబాబు మైండ్‌ సెట్‌లో ‘ఫార్ములాలు’గా వుంటాయనుకోండి. అది వేరే సంగతి అయినాగానీ, ఈ టైమ్‌లో చంద్రబాబు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం పార్టీ వర్గాలూ హర్షించని పరిస్థితి కనిపిస్తోంది.

అవినీతి విషయంలో చంద్రబాబు అస్సలేమాత్రం సీరియస్‌గా వ్యవహరించలేదనీ, పార్టీకి అదో పెద్ద శతృవుగా ఈ ఎన్నికల్లో మారిందనే అభిప్రాయమొకటి టీడీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతూ వచ్చింది. ఆ భయమే ఇంకా టీడీపీ అభ్యర్థుల్ని వెంటాడుతోంది కూడా. సరిగ్గా ఎన్నికలకు ముందర కొందరు ముఖ్య నేతలు టీడీపీని వీడి, వైసీపీలో చేరడం కూడా టీడీపీకి పెద్ద దెబ్బగానే చెప్పాల్సి వుంటుంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ విషయంలో టీడీపీ ప్రదర్శించిన రెండు నాల్కల ధోరణి కూడా టీడీపీ విజయావకాశాల్ని దెబ్బ తీసిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల ఫలితాలకు ముందర చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరి పోయడానికి ఇంకో బలమైన కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే, ఫలితాలు వెల్లడయిన వెంటనే జంప్‌ చేసేందుకు కొందరు టీడీపీ అభ్యర్థులు సిద్ధంగా వున్నారట. అలా వారెవరూ పార్టీ నుంచి జారిపోకుండా వుండడానికే చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారట. అభ్యర్థులందరినీ ఫలితాలకు రెండ్రోజుల ముందే అమరావతికి రప్పించి, క్యాంప్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. ఇలాంటి ఐడియాలు చంద్రబాబుకి మాత్రమే వస్తాయి.

చంద్రబాబు పరిస్థితి ఇలా వుంటే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా ఇవే తరహా ఆలోచనలు చేస్తున్నారు. రేపు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. కౌంటింగ్‌ సందర్భంగా పార్టీ పరమైన జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలనేదానిపై చర్చించబోతున్నారు ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌. అభ్యర్థులెవరూ జారిపోకుండా వుండడానికి వీలుగా క్యాంప్‌ హైద్రాబాద్‌లోనే ఏర్పాటు చేయాలన్నది వైఎస్‌ జగన్‌ ఆలోచన అట. అయితే, పార్టీ అభ్యర్థులు మాత్రం సొంత నియోజకవర్గాల్లోనే వుండాలనీ, గెలిస్తే అక్కడే సంబరాలు చేసుకోవాలని భావిస్తున్నారట.

గెలుపోటముల సంగతెలా వున్నా, టీడీపీ – వైసీపీ తమ అభ్యర్థుల్ని కాపాడుకోవడానికి నాలుగంచెల భద్రతను ప్లాన్‌ చేయక తప్పేలా లేదు. రాజకీయాలు అలా ఉన్నాయ్‌ మరి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...