తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని గత కొంతకాలంగా సీబీఐ వెంటాడుతున్న విషయం విదితమే. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటినుంచీ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తనను టార్గెట్‌గా చేసుకుందని సుజనా చౌదరి వాపోతూ వస్తున్నారుగానీ, నిజానికి సుజనా చౌదరిపై ‘బ్యాంకుల్ని మోసం చేసిన’ కేసులు ఈనాటివి కావు. ఆయన కేంద్ర మంత్రిగా వున్నప్పుడూ అనేక అభియోగాలు ఎదుర్కొన్నారు. అంతకుముందూ, ఆ తర్వాత కూడా సుజనా చౌదరిపై అభియోగాలు కొనసాగుతూనే వున్నాయి.
తాజాగా, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు బెంగళూరు నుంచి ఓ సీబీఐ బృందం హైద్రాబాద్‌కి చేరుకుని సోదాలు నిర్వహించడం గమనార్హం. ఇటీవలే సీబీఐ విచారణకు సుజనా చౌదరి హాజరు కావడం, అరెస్టుని తప్పించుకునేందుకు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తెల్సిన విషయాలే. ఇదిలా వుంటే, సుజనా గ్రూప్‌కి చెందిన నలుగురు డైరెక్టర్లను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస కళ్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ వర్మ అనే డైరెక్టర్లను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
బెస్ట్ క్రాంప్టన్ అనే సంస్థ పేరుతో మాజీ సీబీఐ డైరెక్టర్, ఒకప్పటి టీడీపీ నేత విజయరామారావు కుమారుడితో కలిసి సుజనా చౌదరి వ్యాపారం చేశారు. ఈ వ్యాపారం నిమిత్తం అక్రమంగా రుణాలు తీసుకున్నారనే అభియోగాలు సుజనా చౌదరి సహా, ఆయనకు చెందిన గ్రూప్‌పై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో ఈడీతోపాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాయి. అయితే, తాజా సీబీఐ సోదాలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. గతంలోలా ఇప్పుడు అధికారం లేదు గనుక, గట్టిగా మాట్లాడలేని పరిస్థితి టీడీపీ నేతలది.
2014లో టీడీపీ – బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకోవడం, మిత్రపక్షం టీడీపీకి కేంద్రంలో బీజేపీ రెండు ఎంపీ పదవులు ఇవ్వడం, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వడం తెల్సిన విషయాలే. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. టీడీపీ – బీజేపీ మధ్య విభేదాల కారణంగా రెండు పార్టీలూ తమ స్నేహబంధాన్ని తెగతెంపులు చేసుకున్నాయి. అలా మంత్రి పదవులు పోగొట్టుకున్న తర్వాత, సుజనా చౌదరి పరిస్థితి దయనీయంగా తయారైంది.
161642 550089I like this web website quite significantly, Its a genuinely nice post to read and get information . 215387
389043 817331Excellent editorial! Would like took pleasure the specific following. Im hoping to learn to read a good deal much more of you. Theres no doubt which you possess tremendous awareness and even imagination. I happen to be extremely highly fascinated using this critical data. 292764
105039 931794Aw, this was a genuinely nice post. In concept I wish to put in writing like this additionally – taking time and actual effort to make an exceptional article even so what can I say I procrastinate alot and not at all appear to get something done. 970638