Switch to English

గుడివాడ నీటి బెంగ తీర్చుతున్న లంక దాసరి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ ఆయన్ని కాదనుకుంది. అయినాగానీ, తనను నమ్ముకున్న గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా, తనవంతుగా సాయమందించేందుకు ముందుకొస్తున్నారు టీడీపీ నుంచి అకారణంగా సస్పెండ్‌ అయిన ఒకప్పటి ఆ పార్టీ ముఖ్య నేత, గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ లంక దాసరి ప్రసాదరావు. వేసవి కాలంలో గుడివాడ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. రోజు తప్పించి రోజు మాత్రమే మంచి నీటి రాకతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితిపై ఎమ్మెల్యే కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దాలంటూ లంక దాసరి ప్రసాదరావుని కోరారు. ఈ క్రమంలో నీటి పరిస్థితిని తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన లంక దాసరి, గుడివాడకు నీరందించే రెండు ప్రధాన చెరువుల్ని పరిశీలించారు.

చెరువుల పరిస్థితిని పరీశీలించాక, పైనుంచి నీటిని రప్పించడం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకున్న లంక దాసరి, సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. కొడాలి నాని, లంకదాసరి ప్రసాదరావు విజ్ఞప్తితో స్పందించిన కలెక్టర్‌, ఆయా చెరువుల్లోకి నీటిని తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. దాంతో, ప్రధాన చెరువుల్లోకి నీటి రాక ప్రారంభమయ్యింది. పూర్తిస్థాయిలో చెరువుల్లోకి నీరు గనుక వచ్చి చేరితే, గుడివాడ ప్రజలకు ప్రతిరోజూ మంచినీటిని అందించేందుకు మార్గం సుగమం అవుతుందని లంక దాసరి ప్రసాదరావు చెబుతున్నారు.

మరోపక్క, లంక దాసరి ప్రసాదరావుకి గుడివాడ నగరం పట్ల, అక్కడ వున్న సమస్యల పట్ల వున్న అవగాహన నేపథ్యంలో, తమతో కలిసి పనిచేయాల్సిందిగా ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. అయితే, విధిలేని పరిస్థితుల్లో టీడీపీ నుంచి బయటకు వచ్చిన లంక దాసరి, భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ, ఆయన త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా గుడివాడలో నీటి సమస్య సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం నిధుల సమస్య లేకుండా తాను చూస్తాననీ, ఆయా సమస్యల పరిష్కారం కోసం రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని లంక దాసరికి కొడాలి నాని సూచించడంతో, ఇద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగిస్తారని గుడివాడ వాసులు ఆశిస్తున్నారు.

ఎమ్మెల్యేగా కొడాలి నాని పనిచేస్తున్న సమయంలోనే లంక దాసరి ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ గా గెలిచారు. ఆ సమయంలో లంకదాసరి ప్రసాదరావుకి, ఎమ్మెల్యే హోదాలో కొడాలి నాని సంపూర్ణ మద్దతును అందించారు. అప్పట్లో కొడాలి నాని కూడా తెలుగుదేశం పార్టీలోనే వుండేవారు. ప్రత్యేక కారణాలతో కొడాలి నాని, టీడీపీని వీడి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినా, నియోజకవర్గ సమస్యల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. అదే సమయంలో లంక దాసరి ప్రసాదరావు పార్టీలకు అతీతంగా అందరి మన్ననలూ అందుకుంటూ వచ్చారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...