బ్రిటన్.. అగ్రదేశాల్లో ఒకటి. అలాంటి బ్రిటన్ అధ్యక్షుడికి జీతం సరిపోవడంలేదట. అలా తనకు జీతం సరిపోకపోవడం పట్ల బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్, పదవి నుంచి దిగిపోవాలని అనుకుంటున్నాడట. ఈ విషయాన్ని బ్రిటన్‌కి చెందిన డైలీ మిర్రర్ అనే మీడియా సంస్థ ఓ కథనంలో పేర్కొంది.
బ్రెగ్జిట్ తర్వాత జాన్సన్ దిగిపోయేందుకు సిద్ధంగా వున్నారని ఓ పార్లమెంటు సభ్యుడు తెలిపినట్లు సదరు కథనంలో ప్రస్తావించారు. జాన్సన్ గతంలో ఓ పత్రికలో కాలమిస్ట్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో ఏటా ఆయనకు 2.75 లక్షల పౌండ్లు వచ్చేవట. అలా వచ్చే వేతనంతోపాటుగా, 1.6 లక్షల పౌండ్లను రెండు ప్రసంగాల ద్వారా సంపాదించేవారట బోరిస్ జాన్సన్. కానీ, ప్రధాని అయ్యాక కేవలం 1.5 లక్షల డాలర్లే వేతనంగా పొందుతున్నారట బోరిస్ జాన్సన్. ఈ నేపథ్యంలో కనీస అవసరాలు కూడా తీరడంలేదనీ, వచ్చే జీతంతో ఇంటి ఖర్చులు కష్టంగా జరుగుతున్నాయని బోరిస్ జాన్సన్ వాపోతున్నారట.
నిజమేనా.? ఇలాంటి పరిస్థితులు బ్రిటన్ ప్రధానికి వున్నాయా.? అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. మన దేశంలో అయితే, చాలామంది రాజకీయ ప్రముఖులకు అధికారికంగా సొంత కారు కూడా వుండదు. కానీ, అత్యంత ఖరీదైన జీవితం గడిపేస్తుంటారు. వార్డు మెంబర్ సంపాదన కూడా లక్షల్లో వుంటుందిక్కడ.!
34595 352142Its always very good to learn ideas like you share for blog posting. As I just started posting comments for blog and facing problem of lots of rejections. I think your suggestion would be valuable for me. I will let you know if its work for me too. 737777