Switch to English

బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌: సిగ్గు సిగ్గు ఈ ‘కరోనా’ రాజకీయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రోమ్ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడట.. తెలంగాణలోని అధికార పార్టీ, కేంద్రంలోని అధికార పార్టీ.. ‘నువ్వా.? నేనా.?’ అంటూ రాజకీయంగా తలపడుతున్న తీరు చూస్తోంటే, తెలంగాణ ప్రజానీకానికి ఈ ‘రోవ్‌ు – నీరో’ సామెత గుర్తుకొస్తోంది మరి. కరోనా పరీక్షల కోసం తెలంగాణ తెచ్చుకోవాలనుకున్న ఓ ‘టెస్టింగ్‌ మెషీన్‌’ని కేంద్రం, పశ్చిమ బెంగాల్‌కి తరలించిందంటూ అప్పట్లో మంత్రి ఈటెల రాజేందర్‌ తీవ్ర విమర్శలు చేసిన విషయం విదితమే. ఆ ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు బీజేపీ నేతలు.

ఆ విషయం పక్కన పెడితే, తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనకరంగా వుందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో నిజం లేకపోలేదు కూడా. తెలంగాణలో పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ని కలిసి చర్చించారు. మరోపక్క, తెలంగాణ బీజేపీ నేతలు, కేసీఆర్‌ ప్రభుత్వంపై చేస్తున్న రాజకీయ విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఆ విమర్శలకు ఘాటైన సమాధానాలే ఇస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు.

‘కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు అంటున్నారు. మరి, ప్రపంచంలోనే కరోనా పాజిటివ్‌ కేసుల్లో మూడో స్థానంలో వుంది భారతదేశం. మరి, ప్రధాని మోడీ విఫలమయ్యారని మేమూ అనగలం కదా.! కానీ, రాజకీయాలకు ఇది సమయం కాదు..’ అని తాను చెప్పాలనుకున్నది తాజాగా ఓ సందర్భంలో కేటీఆర్‌ చెప్పేశారు.

అటు కేంద్రం, ఇటు రాష్ట్రం.. రెండూ కలిసి రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిస్తుండడంతో.. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ కరోనా ‘విలయ తాండవం’ చేస్తోంది. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా విజృంభణ చాలా తీవ్రస్థాయిలో వుంది. కేంద్ర బృందాలు వచ్చి వెళుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘చర్యలు తీసుకుంటున్నాం..’ అని చెబుతోంది. జనం తమ చావు తాము చావాల్సి వస్తోంది.!

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాధితుల్ని దోచేస్తున్న వైనం తెలంగాణలోనే కన్పిస్తోందంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది.? తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర హోశాఖ సహాయ మంత్రిగా కీలకమైన పదవిలో వుండి ఏం చేస్తున్నట్లు.? అటు బీజేపీ, ఇటు టీఆర్‌ఎస్‌.. కరోనా రాజకీయాలు చేస్తోంటే.. మధ్యలో ప్రజలే నలిగిపోతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....