పశ్చిమగోదావరి జిల్లాలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ)కి చెందిన ఇద్దరు ముఖ్య నేతల వ్యవహారం ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్‌గా మారింది. ఒకరేమో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కాగా, మరొకరు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు. తనపై అసత్య ప్రచారం చేశారనీ, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేశారు మంత్రి శ్రీరంగనాథరాజు.
కొద్ది రోజుల క్రితమే, వైసీపీకి చెందిన కొందరు నేతలు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, దాడులు చేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఎస్పీకి సైతం రఘురామకృష్ణరాజు తరఫున ఆయన పీఏ ఫిర్యాదు చేయగా, పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఆయన కేంద్ర హోంశాఖని సంప్రదించారు. లోక్‌సభ స్పీకర్‌కి కూడా ఫిర్యాదు చేశారు.
తన ఫిర్యాదు విషయంలో పోలీసులు అస్సలేమాత్రం పట్టించుకోలేదన్నది రఘురామకృష్ణరాజు వెర్షన్. ఎంపీ విషయంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే, మంత్రిగారి ఫిర్యాదుతో మాత్రం ‘యాక్షన్’ షురూ అవుతుందన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. నిజమే మరి, వైసీపీ నేతల మీద టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. అరెస్టులు వెంటనే జరిగిపోతున్నాయి. అదే టీడీపీపైనో, బీజేపీపైనో, జనసేనపైనో వైసీపీ మద్దతుదారులు ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా చర్యలుండడంలేదు. అంతెందుకు, హైకోర్టు తీర్పులకు దురుద్దేశాలు ఆపాదించినవారిపైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వుండనే వున్నాయి.
‘రఘురామకృష్ణరాజుపై మరిన్ని ఫిర్యాదులు వుండబోతున్నాయి.. నేతలు క్యూ కట్టబోతున్నారు..’ అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. రఘురామకృష్ణరాజు మాత్రం.. సింపుల్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. ‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీద అమితమైన ప్రేమ వుంది..’ అంటూనే, ఇటు పార్టీని.. అటు ప్రభుత్వాన్ని ఎక్కడ ఎలా ఇరకాటంలో పడెయ్యాలో అలా పడేస్తున్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే రఘురామకృష్ణరాజుకి షోకాజ్ నోటీస్ అందిన విషయం విదితమే.
614756 271115I actually appreciate your piece of work, Fantastic post. 176951
894366 790757There is noticeably plenty of funds to comprehend this. I suppose you made certain nice points in functions also. 585492
848229 341683Wonderful post will probably be posting this on my blog today keep up the very good function. 618562
245110 420195Some truly marvelous function on behalf with the owner of this web web site , dead excellent articles . 381848