Switch to English

బినామీ క్యాపిటల్‌: అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లోనే వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీని విమర్శించే క్రమంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ), అమరావతి విషయంలో విజ్ఞత కోల్పోతోంది. ‘అసలు మతి వుండే మాట్లాడుతున్నారా.?’ అంటూ అధికార పార్టీ నేతలపై రాష్ట్ర ప్రజలు ఈసడించుకునే పరిస్థితి వస్తోంది.

అమరావతి పేరు చెప్పి చంద్రబాబు, ఆయన సహచరులు దోచుకున్నారన్నదే వాస్తవమైతే.. ఆ దోచుకున్న సొమ్ముని, కక్కించాల్సిన బాధ్యత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదే. కానీ, ఆ దిశగా చిత్తశుద్ధితో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు కనిపించడంలేదు. అమరావతిని స్మశానం అన్నారు.. అమరావతిని ముంపు ప్రాంతం అన్నారు.. అమరావతిన ఎడారి అన్నారు.. నిజానికి పాకిస్తాన్‌ని కూడా బహుశా మనం ఇలా అభివర్ణించలేదేమో ఎప్పుడూ.!

అసలు, అమరావతి ఆంధ్రప్రదేశ్‌లోనే వుందా.? వుంటే, అది తమకు ఇష్టం లేని, తమకు సంబంధం లేని వ్యవహారంగా అధికార వైసీపీ ఎందుకు చూస్తున్నట్లు.? తాజాగా, అమరావతిని ‘బినామీ క్యాపిటల్‌’ అని అభివర్ణించేశారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌. ఇదెక్కడి పదజాలం.? ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ‘డెమోగ్రాఫికల్‌ ఇంబాలెన్స్‌’ అనే ప్రస్తావన చేస్తూ, రాజధాని అంటే అన్ని కులాల వారూ.. అన్ని మతాల వారూ వుండాలి.. అని చెబుతారేంటి.? అంటే, అమరావతిలో అన్ని కులాలు, అన్ని మతాలూ లేరనా.? పేదలు అక్కడ లేరనా.?

నిజానికి, భూములు ఎక్కడికీ పోలేదు. ఆ భూముల్ని టీడీపీ నేతల బినామీలే లాగేసుకుని వుంటే, ఆధారాలతో సహా నిరూపించి.. అసలు హక్కుదారులకు ఆ భూముల్ని అప్పగించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే. కానీ, ఆ పని వైసీపీ చెయ్యదుగాక చెయ్యదు. ‘అమరావతిలో భూ కుంభకోణం..’ అంటారు.. అమరావతిని స్మశానం అంటారు.. అమరావతిని బినామీ క్యాపిటల్‌ అంటారు.. ఇదెక్కడి రాజకీయం.?

అధికార పార్టీ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే, అమరావతి ఎక్కడో ఆకాశంలో లేదు.. పాతాళంలోనూ లేదు.. పొరుగు దేశంలో అసలే లేదు. అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లోనే వుంది. అది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని. ఆ అమరావతినే, శాసన రాజధానిగా వైసీపీ ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. మరి, వైసీపీ నేతలకు అమరావతి అంటే ఇంకా ఎందుకు గిట్టడంలేదు.?

ఈ అమరావతిలోనే మెజార్టీ నియోజకవర్గాల్లో దళిత నేతలు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారాయె. డెమోగ్రాఫిక్‌ ఇంబాలెన్స్‌ అనీ, ఇంకోటనీ.. స్మశానమనీ, మరోటనీ.. విమర్శలు చేసేముందు.. తమను తాము ఒక్కసారి ప్రశ్నించుకుంటే మంచిది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...