Switch to English

దుబ్బాక, గ్రేటర్‌ ఎఫెక్ట్‌: కేసీఆర్‌ మారిన మనిషి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో అన్నిసార్లూ తాము అనుకున్నట్లుగానే అంతా జరుగుతుందనుకుంటే పొరపాటే. ఉద్దేశ్యం మంచిదే అయినా, ఆయా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎదురయ్యే ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిందే.

తెలంగాణ లో నియంత్రిత సాగు విషయమై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. ప్రభుత్వం సూచించిన పంటల్ని మాత్రమే రైతులు వేయాలంటూ కొన్నాళ్ళ క్రితం కేసీఆర్‌ సర్కార్‌ హుకూం జారీ చేసింది. మార్కెట్‌ స్థితిగతులు, ప్రకృతి ప్రకోపాలు.. ఇలాంటి అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని, రైతులకు సూచనలు, సలహాలు చేయడం ఫర్లేదుగానీ, వ్యవసాయాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని పాలకులు అనుకుంటే అది కుదరని పని.

ప్రభుత్వం, తమను ఇబ్బందులు పెడుతోందన్న నిర్ణయానికి రైతులు వచ్చేశారు. ఆ ఎఫెక్ట్‌ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గట్టిగానే కనిపించింది. దానికి తోడు, గ్రేటర్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కి షాక్‌ తగిలే ఫలితాలు వచ్చాయి. దాంతో, తమ నిర్ణయాల విషయమై పునఃసమీక్షించుకోవడానికి కేసీఆర్‌ వెనుకంజ వేయలేదు. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంపైనా వెనక్కి తగ్గారు. కొత్త విధానాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇంకోపక్క, వ్యవసాయంపై నియంత్రణా లేదని తేల్చేశారు కేసీఆర్‌.

తప్పదు.. రాజకీయ పరిస్థితులు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఒక్క చిన్న ‘తేడా నిర్ణయం’ అయినా.. పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టమే కలిగిస్తుంది. నిజానికి, కేసీఆర్‌ కాస్త ఆలస్యంగా తేరుకున్నారు. ప్రజా వ్యతిరేకత గురించి ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ తెప్పించుకోవడంలో వైఫల్యం చెందారో ఏమోగానీ.. కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచేసరికి.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మరిప్పుడు, డ్యామేజీ కంట్రోల్‌ చర్యలతో టీఆర్‌ఎస్‌కీ, టీఆర్‌ఎస్‌ సర్కార్‌కీ కాస్తంతైనా రాజకీయంగా ఉపశమనం కలుగుతుందా.? ఏమో, అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. ఒక్కటి మాత్రం నిజం.. కేసీఆర్‌ మారిన మనిషి. ఆయన్ని దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు మార్చేశాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...