స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో కష్టకాలమొచ్చి పడింది. తెలంగాణలో పూర్తిగా గల్లంతయిపోయిన తెలుగుదేశం పార్టీ, కొద్ది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌పైనా ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చేలా వుంది. ఇంతకీ, తెలుగుదేశం పార్టీ ఇంతటి దుస్థితిని ఎదుర్కోవడానికి కారణమేంటి.? ఈ ప్రశ్నకి సమాధానంగా అందరి వేళ్ళూ టీడీపీ అధినేత చంద్రబాబు పుత్ర రత్నం నారా లోకేష్ వైపే చూపిస్తున్నాయి.
‘జయంతికీ వర్ధంతికీ తేడా తెలియని లోకేష్..’ అనే విమర్శ లోకేష్‌కి సంబంధించి చాలా పాపులర్. రాజకీయాలన్నాక మాట తడబడటం సహజమే. వైఎస్ జగన్ కూడా నోరు జారిన సందర్భాలున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. తలపండిన రాజకీయ నాయకులూ ఒక్కోసారి మాట తడబడటం సహజమే. కానీ, నారా లోకేష్ పరిస్థితి వేరు.. ఎప్పుడూ తడబడుతూనే వుంటారాయన.
కీలక సమయాల్లో లోకేష్ తడబాటు, తెలుగుదేశం పార్టీకి తలవంపులు తెచ్చిపెడుతూ వచ్చింది. ఎన్నికల పోలింగ్ తేదీ విషయమై లోకేష్ తడబడిన తీరు, ఆయన ఓటమికి కారణమయ్యిందంటారు కొందరు. అందుకే, నారా లోకేష్‌ని తెలుగుదేశం పార్టీకి గుదిబండగా అభివర్ణిస్తారు.. టీడీపీ నుంచి బయటకు వచ్చే నేతలు. కానీ, చంద్రబాబు వారందరి మాటా వినీ, టీడీపీకి లోకేష్‌ని దూరం చేస్తారా.? ఛాన్సే లేదు.
లోకేష్ గతంలో మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ.. పైగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. టీడీపీ అధికారంలో వున్నప్పుడు చాలామంది సీనియర్ నేతలు, లోకేష్ ‘అతి’పై అసహనం వ్యక్తం చేశారు. అప్పుడే చంద్రబాబు ‘దిద్దుబాటు’ చర్యలు తీసుకుని వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది.
ఒక్కటి మాత్రం నిజం.. టీడీపీకి ఇటీవలి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు తక్కువేమీ కావు. కానీ, సీట్ల సంఖ్య పరంగా అత్యంత దారుణ స్థితికి పడిపోయింది. అదే ఇప్పుడు నారా లోకేష్‌కి తలనొప్పిగా తయారైంది. రానున్న రోజుల్లో టీడీపీ గనుక కాలగర్భంలో కలిసిపోవడమంటూ నిజమైతే, ఆ పాపం ఖచ్చితంగా లోకేష్‌కే చుట్టుకుంటుంది.
179462 794961We clean up on completion. This may sound obvious but not several a plumber in Sydney does. We wear uniforms and always treat your home or office with respect. 173580
601990 917269Wow! This could be 1 specific of the most valuable blogs Weve ever arrive across on this topic. Actually Fantastic. Im also an expert in this subject therefore I can understand your hard work. 247508
757229 426479Sweet internet internet site , super pattern , really clean and utilize friendly . 977883