Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir files) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) . ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’. (The Vaccine war) కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు పడిన కష్టాన్ని చూపిస్తూ ఈ సినిమా తెరకెక్కించారు. ఈనెల 28న ఈ సినిమా విడుదల కానుంది. అయితే.. తన సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
‘చిత్ర పరిశ్రమ నాపై నిషేధం విధించినట్టుంది. ది కశ్మీర్ ఫైల్స్ లో వచ్చిన లాభాలతో ది వ్యాక్సిన్ వార్ తెరకెక్కించా. కానీ.. నా సినిమాను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయి. రివ్యూలు చెప్పకుండా ఉండేందుకు ఇప్పటికే చాలామందికి డబ్బులు కూడా పంచేశారు. నాతో సినిమాలు తీసేందుకు రూ.300కోట్లు ఇచ్చేందుకు కూడా వచ్చారు. కానీ.. నేను ఎవరి ట్రాప్ లో పడలేదు. ది వ్యాక్సిన్ వార్ సక్సెస్ కాకపోతే గతంలో మాదిరే నా పరిస్థితి తయారవుతుంది. కానీ.. నా సినిమాకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయ’ని అన్నారు.