Switch to English

అబ్జర్వేషన్‌: ముఖ్యమంత్రి పదవి బాలయ్యకు ఎంత దూరం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘మేం పదవులకు అలంకారం.. అంతే తప్ప, మాకు పదవులు అలంకారం కానే కాదు..’ అని పలు సందర్భాల్లో నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. సినీ రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా ఆయన వ్యవహార శౖలి అత్యంత ప్రత్యేకం. ఎవరేమనుకున్నాసరే, బాలయ్య రూటే సెపరేటు. ఒక్కోసారి ఆయన మాట్లాడే మాటలు చాలా వింతగా అన్పిస్తుంటాయి. కొందరికి కామెడీగానూ అన్పిస్తే అది వాళ్ళ తప్పు కానే కాదేమో.!

ఇక, స్వర్గీయ ఎన్టీఆర్‌కి నట వారసుడ్ని తానేనని బాలయ్య చెబుతుంటారుగానీ, రాజకీయంగా మాత్రం వారసుడ్ని అని గట్టిగా బల్లగుద్ది చెప్పేయలేరు. అందుక్కారణం తన బావ, వియ్యంకుడైన చంద్రబాబు, టీడీపీ అధినేతగా వున్నారు. పైగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ స్వయంగా తన కుమార్తెకి భర్త. మేనల్లుడు, అల్లుడు కూడా అయిన నారా లోకేష్‌, చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చేపడ్తారని బాలయ్యకీ తెలుసు. ఆ విషయాన్ని పదే పదే బల్లగుద్ది చెప్పాల్సిన పనిలేదు కూడా. సో, సమీప భవిష్యత్తులో నందమూరి బాలకృష్ణ సీఎం పీఠంపై కూర్చునే అవకాశం లేదు.

అంతెందుకు, బాలయ్యకు ‘మంత్రి’ అన్పించుకోవాలనే ముచ్చట వున్నా, దాన్నీ తీర్చేందుకు ఇష్టపడరు నారా చంద్రబాబునాయుడు. బావమరిది బాలయ్య మీద ఆ మాత్రం ‘ప్రేమ’ వుండి వుంటే, చంద్రబాబు ఎప్పుడో ఆ పని చేసేవారే. ఇక, బాలయ్య అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడ్ని ముఖ్యమంత్రి పదవిలో చూసుకోవాలనుకుంటున్నారు. ‘కాబోయే సీఎం బాలయ్య..’ అంటూ సోషల్‌ మీడియాలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్లతో హోరెత్తించేశారు కొందరు అభిమానులు.

బాలయ్య మాత్రం, తన ఇంటర్వ్యూల్లో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేశారుగానీ, తన పదవి విషయంలో ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తపడ్డారు. ‘చంద్రబాబు చేతిలో రిమోట్‌ ఎలా చెబితే, బాలయ్య అలానే మాట్లాడతారు..’ అంటూ కొందరు అభిమానులు సైతం సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టడం గమనార్హమిక్కడ. సో, బాలయ్యకు ముఖ్యమంత్రి పదవి అందనంత దూరం అన్న మాట. టీడీపీకి పూర్వ వైభవం వచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే, ప్రస్తుతం టీడీపీ అంతలా దిగజారిపోయింది. ఒకవేళ టీడీపీకి అదృష్టం కలిసొచ్చి పుంజుకున్నా, బాలయ్య అభిమానుల కోరిక తీర్చేందుకు చంద్రబాబు ఒప్పుకునే అవకాశమే లేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...