Switch to English

భారత్ పై ముప్పేట దాడికి వ్యూహమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఓ వైపు భారత సరిహద్దుల్లో చైనా ఘర్షణలు.. మరోవైపు కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు.. ఇంకోవైపు కాశ్మీర్లో ఉగ్రవాదల కాల్పులు.. ఇవన్నీ ఒకే సమయంలో జరుగుతుండటం చూస్తుంటే దీని వెనుక పెద్ద ప్రణాళికే ఉందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ చైనానే దోషిగా చూస్తున్నాయి. చైనాలో ఉన్న పాశ్చాత్త దేశాలకు చెందిన చాలా కంపెనీలు వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో మేకిన్ ఇండియా నినాదంతో అలాంటి కంపెనీలను దేశంలోకి ఆకర్షించాలని భారత్ భావించింది. మరోవైపు కరోనా వైరస్ విషయంపై చైనాలో విచారణ జరగాల్సిందేనని అంతర్జాతీయంగా ఒత్తిడి మొదలైంది. దీంతో ఈ పరిణామాలన్నీ చైనా నాయకత్వంలో అసహనానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికి చైనా గాల్వాన్ లోయలో దాష్టీకానికి తెగబడినట్టు అర్థమవుతోంది.

చర్చల్లో ఒకటి అంగీకరించి, అర్ధరాత్రి వేళ తన వికృత రూపాన్ని ప్రదర్శించింది. మే 5వ తేదీన కూడా చైనా సైనికులు, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్టు తాజాగా వెల్లడైంది. అప్పుడు ఓ కల్నల్ సహా కొందరు జవాన్లు గాయపడ్డారు. మరోవైపు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పాకిస్థాన్ కూడా తాజాగా రెచ్చిపోతోంది. రెండు మూడు రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులతో తెగబడుతోంది. దీంతో దాయాదికి మన సైనికులు ధీటైన జవాబిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగా కాశ్మీర్ లోయలో కల్లోలం రేపడానికి ఉగ్రవాదులు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు.

గత 24 గంటల్లో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 8 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. పుల్వామా జిల్లాలోని అవంతిపొర ప్రాంతంలో ముగ్గురు హతం కాగా, సోపియన్ జిల్లాలో ఐదుగురు టెర్రరిస్టులను మన బలగాలు కాల్చి చంపాయి. నిజానికి పాక్ కాల్పులకు తెగబడుతోందంటే చొరబాటుదారులను కాశ్మీర్ లోకి పంపించాలనే ఎజెండా దాని వెనుక ఉంటుంది. భద్రతా దళాల దృష్టి మరల్చి ఉగ్రవాదులను కాశ్మీర్లోకి పంపిస్తుంటుంది. గత కొంతకాలంగా ఎలాంటి కవ్వింపు చర్యలకూ పాల్పడని పాక్.. తాజాగా చైనా దన్ను చూసుకుని రెచ్చిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇటు పాక్ కే కాదు.. అటు చైనాకు కూడా మనమేంటో చూపాల్సిందేననే అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...