Switch to English

ఏపీలో బీజేపీకి కేంద్ర మంత్రి కావలెను

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణకు ఓ కేంద్ర మంత్రి పదవిని కేటాయించింది భారతీయ జనతా పార్టీ. మరి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ స్థాయి నేత ఎవరూ లేరనుకుందేమో, ప్రస్తుతానికి ఆ అవకాశమైతే ఏపీలో ఎవరికీ దక్కలేదు. ఒక్క అసెంబ్లీ సీటుగానీ, ఒక్క పార్లమెంటు సీటుగానీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి దక్కలేదంటే, అదంతా బీజేపీ స్వయంకృతాపరాధమే. ఆంధ్రప్రదేశ్‌ని అన్ని విధాలా ఉద్ధరించేశామని బీజేపీ ఎంత చెప్పుకున్నా, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి బహిరంగ సభల్లో తమ ‘ఉద్ధరింపు’ గురించి ఏకరువు పెట్టినా రాష్ట్ర ప్రజానీకం విశ్వసించలేదు. చివరి నిమిషంలో కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ‘పుండు మీద కారం చల్లినట్లు’ చేసింది. వాల్టేర్‌ డివిజన్‌ని ముక్కలు చేసి, ఆ డివిజన్‌ ఉనికి లేకుండా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ అనేసరికి.. బీజేపీ మిగిలిన ఆ కాస్తో కూస్తో గౌరవం కూడా పోయింది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకి. ఆ ఫలితమే తాజా ఎన్నికల్లో బీజేపీకి జరిగిన ఘోర పరాభవం.

ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ నేతలెవరూ తమ అధిష్టానాన్ని పదవులపై గట్టిగా అడగలేని పరిస్థితి. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా విస్మరించేసింది, ఈ రాష్ట్రంపై ఆశలు కూడా వదిలేసుకుంది. అయితే, రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన గాసిప్‌ ప్రచారంలోకి రావడం సంచలనంగా మారింది. ఇది బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి అందుతున్న ‘లీక్‌’గా కొందరు అభివర్నిస్తున్నారు. ఇంతకీ ఆ గాసిప్‌ సారాంశమేంటంటే, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఓ బలమైన ‘కేంద్ర మంత్రి’ కోసం ఎదురుచూస్తోందట. దానర్థం, కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి బీజేపీకి కావాలని. బీజేపీని, ఆంధ్రప్రదేశ్‌లో కాస్తో కూస్తో బలంగా నిలబెట్టగల ‘పవర్‌’ కోసం ఎదురుచూస్తున్న బీజేపీ, ఆ స్థాయి వ్యక్తి దొరికితే, కేంద్ర మంత్రి పదవితో సత్కరించి, తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేసుకోవాలని నరేంద్ర మోడీ – అమిత్‌ షా ద్వయం భావిస్తోందని సమాచారమ్‌.

గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణతో ఉద్యోగానికి రాజీనామా చేయించింది బీజేపీయేనని ప్రచారం జరిగింది. ఆయనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా వార్తలొచ్చాయి. అయితే లక్ష్మినారాయణ చివరకు జనసేనలో చేరారు. ఆయన ఆ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి విశాఖ నుంచి పరాజయం పాలయ్యారు. ఆయన మీద మళ్ళీ బీజేపీ కన్నేసిందా? లేదంటే ఇంకెవరి రాకని అయినా ఆశిస్తోందా? అనేదానిపై స్పష్టత లేదు. కంభంపాటి హరిబాబు లాంటి సీనియర్‌ నేతలు బీజేపీలో వున్నా, వాళ్ళెవరికీ ప్రజా బలం లేని పరిస్థితి. అన్నిటికీ మించి విశ్వసనీయత వున్న నేతలే ఏపీలో బీజేపీకి లేరు. మరి, 2024 ఎన్నికల్ని లక్ష్యంగా బీజేపీ చేసుకోవాలనుకుంటే అప్పటికన్నా ఆ పార్టీని కాస్తో కూస్తో బలోపేతం చేయగల గట్టి వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి దొరకాలి కదా!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...