Switch to English

అమరావతి రైతుల్ని నడిరోడ్డు మీద.. మోకాళ్ళపై నిలబెట్టిందెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

రైతు కోసం వేల కోట్లు.. లక్షల కోట్లు ఖర్చు చేసేస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ, వ్యవసాయం లాభసాటిగా ఎందుకు మారడంలేదు.? అసలు రైతుల పట్ల ప్రభుత్వాలు చూపే ‘శ్రద్ధ’లో చిత్తశుద్ధి ఎంత.? ఈ ప్రశ్న చుట్టూ దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే వుంది. ‘మేం అధికారంలోకి వస్తే రైతుల్ని ఉద్ధరించేస్తాం..’ అని చెప్పని ప్రభుత్వం వుండదు. కానీ, ప్రతి ప్రభుత్వంలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కన్పిస్తుంటాయి.

ఇక్కడ, అమరావతిలో రైతుది చిత్ర విచిత్రమైన దీనగాధ. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అయ్యింది. రాజధాని కోసం భూములు కావాలని అప్పటి ప్రభుత్వం అడిగితే.. ప్రభుత్వం చూపిన ‘గ్రాఫిక్స్‌’ చూసి, రైతులు ప్రభుత్వానికి పెద్దయెత్తున భూముల్ని ఇచ్చారు. ఇది తెలిసిన కథే. ఆ రైతులు, ఇప్పుడు నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద నిల్చుని.. న్యాయం కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించింది.

అమరావతి పరిధిలో కన్పించిన ఈ దృశ్యం ఇప్పుడు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. అలా రోడ్డు మీద మోకాళ్ళపై నిల్చున్న రైతుల్లో మహిళలు కూడా వున్నారు. ‘అబ్బే, వాళ్ళంతా పెయిడ్‌ ఆర్టిస్టులు..’ అని రాజకీయ నాయకులు ‘పిచ్చి కూతలు’ కూయొచ్చుగాక. రైతులు పెయిడ్‌ ఆర్టిస్టులయితే.. ప్రపంచమెలా వుంటుంది.? అసలు ప్రపంచానికి తిండి ఎలా దొరుకుతుంది.? ఈపాటి విజ్ఞత లేనోళ్ళు రాజకీయాల్లో వుండబట్టే.. రైతుల దుస్థితి ఇలా తగలడింది. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్‌ జగన్‌.. అంతే తేడా. రైతుల్ని ఇద్దరూ కలిసే నట్టేట్లో ముంచేశారు.

కేవలం చంద్రబాబు అడిగారని రైతులు భూముల్ని ఇచ్చేయలేదు.. ప్రతిపక్ష నేత కూడా అమరావతికి ‘జై’ అన్నాకనే రైతులు, ప్రభుత్వానికి భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడేమో, ప్రభుత్వం మారింది గనుక.. ‘మా ఇష్టం’ అంటున్నారు ప్రస్తుత అధికార పార్టీ నేతలు. ‘మా ఇష్టం.. రాజధానిని మేమెక్కడైనా కట్టుకుంటాం..’ అంటున్నారు. అంతేనా, ‘ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని..’ అని కూడా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుంది.? అమరావతి రైతులకి అన్యాయం జరిగిందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఆ అన్యాయం చేసింది కేవలం గతంలో పరిపాలించిన చంద్రబాబు అండ్‌ టీమ్ మాత్రమే కాదు.. ప్రస్తుతం అధికారంలో వున్న వైఎస్‌ జగన్‌ అండ్‌ టీమ్ కూడా.

పొద్దున్న లేస్తే రైతుల గురించి ఉపన్యాసాలు దంచేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు. ఏం, అమరావతి రైతులు ఈ పెద్దలకు కన్పించడంలేదా.? అమరావతి రైతులంటే ఎందుకింత నిర్లక్ష్యం.? ‘మీ సమస్యలేంటి.?’ అని ప్రశ్నించలేకపోతున్న ముఖ్యమంత్రి, పరిపాలనా వ్యవహారాల నిమిత్తం.. ఆ రాజధానిలోనే.. ఆ అమరావతి రైతులు కన్నీరు మున్నీరవుతున్న రోడ్ల మీద నుంచే సచివాలయానికి వెళుతన్నారాయె. రైతు పట్ల దయలేని ప్రభుత్వం.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...