అమరావతి పేరుతో రాష్ట్రంలో రాజకీయ రచ్చ తప్ప, రాష్ట్రానికి ఓ రాజధాని అత్యవసరమన్న ఇంగితాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్న విమర్శలున్నాయి. ప్రతి నెలా పెన్షన్లు, క్యాలెండర్ పెట్టుకుని మరీ సంక్షేమ పథకాలూ తెరపైకి తెస్తున్న వైఎస్ జగన్ సర్కార్, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు అవ్వాల్సిన రాజధాని విషయంలో అస్సలేమాత్రం శ్రద్ధ పెట్టడంలేదంటే ఏమనుకోవాలి.? మూడు రాజధానులకి అనుగుణంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నమాట వాస్తవం. కానీ, ఆ వ్యవహారమిప్పుడు కోర్టులో వుంది కదా.? అదెప్పటికి ఓ కొలిక్కి వస్తుందో చెప్పలేని పరిస్థితి.
చంద్రబాబు హయాంలో ప్లాన్ జరిగినట్లు లక్ష కోట్లతో రాజధాని అవసరం లేకపోవచ్చు. కానీ, రాష్ట్రానికి ఖచ్చితంగా ఓ మెరుగైన రాజధాని వుండి తీరాల్సిందే. అదే అమరావతి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా అమరావతి.. ప్రస్తుతానికి అధికారికంగా ఆంధ్రపదేశ్ రాజధాని. ఇక, ఇక్కడ భూ కుంభకోణాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్షంలో వున్నప్పుడూ అవే ఆరోపణలు, అధికారంలోకి వచ్చాక కూడా అవే ఆరోపణలు. రెండేళ్ళు దాటుతోంది వైసీపీ అధికారంలోకి వచ్చి.. ఒక్క ఎకరం భూమిని అయినా.. ఒక్క కోటి రూపాయల ధనాన్నయినా.. ‘అక్రమం’ అనే కోణంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్రజలకు చూపించగలిగిందా.? లేదాయె. టీడీపీ అధినేత చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత పోలీసులను ఆశ్రయిస్తే, కేసులు బనాయించారు.
ఏపీ సీఐడీ పెట్టిన కేసు విషయమై హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. లేదంటే, ఈపాటికి చంద్రబాబు అరెస్టయి వుండేవారేమో. ఈ కేసులో తాజాగా సీఐడీ, కౌంటర్ దాఖలు చేసింది. అవే పాత ఆరోపణలు, వాటికి కొత్త రంగులు పులుముతూ వైసీపీ మళ్ళీ యాగీ షురూ చేసింది. ఒక్కసారి వ్యవహారం కోర్టుకి వెళ్ళాక.. అదెప్పటికి తేలా.? వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు కళ్ళముందు కనిపించడంలేదా.? ల్యాండ్ పూలింగ్ పేరుతో అమరావతిలో అక్రమాలు జరిగాయో లేదోగానీ, వైసీపీ మాత్రం ల్యాండ్ ఫూలింగ్ చేస్తోంది రాష్ట్ర ప్రజల్ని.
311419 438253An interesting discussion is worth comment. I believe which you require to write a lot more on this matter, it may not be a taboo subject but typically individuals are not enough to speak on such topics. To the next. Cheers 468189
984419 855610I definitely did not understand that. Learnt 1 thing new today! Thanks for that. 463773
989012 656455Spot on with this write-up, I genuinely assume this internet site wants way a lot more consideration. Ill probably be once much more to read far a lot more, thanks for that info. 650689